Home » ప‌సివాడి ప్రాణం సినిమా నుంచి కృష్ణ ఎందుకు త‌ప్పుకున్నారో తెలుసా..?

ప‌సివాడి ప్రాణం సినిమా నుంచి కృష్ణ ఎందుకు త‌ప్పుకున్నారో తెలుసా..?

by Anji
Ad

ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ అన‌గానే టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌లు గుర్తుకొస్తాయి. ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాలు మ‌ద్రాస్‌లోని విజ‌య వాహిని, జెమిని స్టూడియోస్ లోనే షూటింగ్ జ‌రుపుకుని ఆంధ్ర‌, త‌మిళ‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల‌లో విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందేవి. ఆ త‌రువాత భాషా ప్ర‌యుక్త రాష్ట్రాలు ఏర్ప‌డ‌టంతో ద‌క్షిణాది రాష్ట్రాలు సొంతంగా సినీ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రమైన కేర‌ళ అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాల‌ను నిర్మించుకుంటుంది. అయిన‌ప్ప‌టికీ కొత్త క‌థ‌లతో సినిమాల‌ను నిర్మించి విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు.

Also Read :  అల్లు అర‌వింద్ పై ప‌వ‌న్ రివేంజ్ తీర్చుకుంటున్నారా..?

Advertisement


ఈ త‌రుణంలో విజ‌య‌వంతమైన చిత్రాల రీమెక్ హ‌క్కుల‌ను టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండ‌ల్ వుడ్ కొన్ని సంద‌ర్భాల్లో బాలీవుడ్‌కు అమ్ముతున్నారు. 1985 పీట‌ర్ వేర్ ద‌ర్శ‌క‌త్వంలో హారిస‌న్ ఫోర్ట్ హీరోగా విట్నేస్ చిత్రం విడుద‌ల‌యింది. కొత్త క‌థ‌లు కొర‌కు చూస్తున్నా మ‌ల‌యాళ క‌థా ర‌చ‌యిత ఫాజిల్ విట్నేస్ చిత్రాన్ని చూసి ఇండియ‌న్ నేటివిటిక‌నుగుణంగా క‌థ‌లో మార్పులు చేసి మ‌మ్ముట్టి, న‌ది హీరో, హీరోయిన్లుగా పూవిన్ పుతియా పూన్ తెన్న‌ల్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

Advertisement

మ‌ల‌యాళంలో వ‌చ్చిన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. అలా ఈ విజ‌య‌వంత‌మైన సినిమా కోసం ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ నిర్మాత‌లు పోటీప‌డి రీమెక్ హ‌క్కుల‌ను కొనుక్కున్నారు. తెలుగు నిర్మాత‌లు పోటీ ప‌డగా చివరికీ రీమెక్ హ‌క్కులు అల్లు అర‌వింద్‌కు ద‌క్కాయి. ఇది గ‌మ‌నించ‌ని విజ‌య‌బాపినీడు విట్నేస్ అనే ఇంగ్లీషు చిత్రాన్ని చూసి ఓ క‌థ‌ను రాసుకున్నాడు.


అచంట గోపినాథ్ నిర్మాత‌గా విజ‌య‌బాపీనీడు ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణ‌, శ్రీ‌దేవి హీరో హీరోయిన్ అని భావించారు. ఇందులో బాట‌న‌టుడిగా మ‌హేష్ బాబు అని కూడా అనుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాల‌ని అనుకున్న త‌రుణంలోనే ఇదే క‌థ‌తో చిరంజీవి సినిమా చేస్తున్నార‌ని తెలిసి అలాంటి క‌థ‌తో మ‌రొక సినిమా చేయ‌డం మంచిది కాద‌ని ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించ‌డం విర‌మించుకున్నాడు. ఆ విధంగా కృష్ణ‌తో చేయాల్సిన ప‌సివాడి ప్రాణం కాస్త ఆగిపోయింది.

Also Read :  చాలా బాధ‌ప‌డుతున్నా..ట్రోల్స్ మీమ్స్ పై మోహ‌న్ బాబు..!

Visitors Are Also Reading