Home » ఏప్రిల్ 01న బ్యాంకులను ఎందుకు బంద్ చేస్తారో తెలుసా ?

ఏప్రిల్ 01న బ్యాంకులను ఎందుకు బంద్ చేస్తారో తెలుసా ?

by Anji

సాధారణంగా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు తప్ప  ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని ఏప్రిల్ 01న బంద్ నిర్వహిస్తాయి. ఇది చాలా కాలం నుంచి వస్తుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 01న అనగా వచ్చే శనివారం బ్యాంకులు బంద్ కానున్నాయి. అసలు ఏప్రిల్ 01న బ్యాంకులను ఎందుకు మూసివేస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు. వాస్తవానికి ప్రతి ఏడాది బ్యాంకు ఉద్యోగుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా నోటిఫైడ్ బ్యాంకుల ఖాతాలను వార్షికంగా క్లోజ్ చేయడమే దీనికి కారణం.  

Also Read :  విటమిన్ల లోపాన్ని తెలిపే సంకేతాలు ఇవే..!

ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. ఈ తరుణంలోనే బ్యాంకు ఉద్యోగులు మార్చి 31న ఆర్థిక పనిని పూర్తి చేసే బాధ్యతను కలిగి ఉంటారు. ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేస్తారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఫస్ట్ రోజు అనగా ఏప్రిల్ 1న బ్యాంకులు బంద్ చేస్తారు. యాన్యువల్ క్లోజింగ్ రోజుగా దీనిని పరిగణిస్తూ.. బ్యాంకులు ఆరోజును సెలవు ఇస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరచి ఉంటాయి. 

Also Read :  వయస్సు అయిపోయిన హీరోయిన్లు… ఆంటీ పాత్రలకే పరిమితమా? – అల్లు అర్జున్ హీరోయిన్

Manam News

ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఏప్రిల్ 2023లో బ్యాంకులు మూసివేతతో దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. ప్రాంతీయ సెలవులతో పాటు ఆదివారాలు, రెండో, నాల్గో శనివారాలున్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంకు వార్షిక ఖాతా ముగింపు, మహావీర్ జయంతి, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి, బిజూ ఫెస్టివల్, తమిళ న్యూఇయర్ డే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక ఇవే కాకుండా బెంగాళీ నూతన సంవత్సర దినోత్సవం, జుమాత్ ఉల్ విదా, రంజాన్ వంటి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులున్నాయి. ఏప్రిల్ నెలలో కేవలం 15 రోజులు మాత్రమే ఉంటాయి. మిగతా 15 రోజులు సెలవులుండటం గమనార్హం.  

Also Read :  నాగచైతన్య కొత్త ఇంటి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading