భారతదేశ సాంప్రదాయం ప్రకారం.. ప్రతి ఆచారం వెనుక దాని పరమార్థం దాగి ఉంది. సాదారణంగా పెళ్లి జరిగినప్పుడు, లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఫంక్ష్లన్లలో కట్నాలు రాయిస్తుంటారు.
Advertisement
ఇందులో భాగంగా వారు రూ.100, 500, 1000 ఇలా ఇవ్వకుండా ఎక్కువ శాతం రూ.101, రూ.501, రూ.1001 లేదా 1016 మాదిరిగా చదివిస్తుంటారు. ముఖ్యంగా ప్రతి దాని చివర ఒకటి లేదా 6 వచ్చే విధంగా చూసుకోవడం వెనుక ఓ కారణమే దాగి ఉంది.
ముఖ్యంగా రూ.100, రూ.500, రూ.1000 వీటి చివరన సున్నా అంకె ఉంది. దానికి విలువ లేదని.. అది అంతిమం అని సూచిస్తుంది. దీనిని పెద్దలు నెగెటివ్‌గా భావిస్తారు. అందుకే చివర సున్నా ఉండకుండా జాగ్రత్త పడతారు. రూ.101, 1001 వంటి సంఖ్యలు మాత్రం అసలు విభజించబడవు. మనం ఇచ్చేది వారికి ఏదైనా అదే ఫైనల్ అని సూచించకూడదు. ఏదైనా ప్రారంభం అవ్వాలంటే ఒక అంకే ముందు ఉంటుంది. ఒకటి ఉండేవిధంగా చూసుకుని ఎక్కువగా డబ్బులను చదివిస్తుంటారు. ఒకటితో పాటు కొందరూ 6 ను కూడా శుభ సూచకంగా భావిస్తారు.
Advertisement
సున్నా మాత్రం దీనికి చాలా విరుద్ధంగా ముగింపును సూచిస్తుంది. అందుకే శుభకార్యాల్లో కట్నంగా డబ్బులు ఇచ్చే చివర సున్నా ఉండకుండా.. ఒక సంఖ్య ఉండే విధంగా చూసుకుంటారు. దీనిని చాలా మంది దీనిని పాటిస్తుంటారు. కొందరూ దేవాలయాల్లో డబ్బులు విరాళాల రూపంలో ఇచ్చేటప్పుడు కూడా చివరకు ఒక అంకే ఉండేవిధంగా చూసుకుంటారు. కొన్ని చోట్ల వేలం పాటలో కూడా చివరకు ఒక అంకే ఉండేవిధంగా వేలం కూడా నిర్వహిస్తుంటారు.
Also Read :
Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబంలో తగాదాలు వస్తాయి
యూత్ ఫుల్ సినిమాతో రవితేజ కొడుకు ఎంట్రీ…డైరెక్టర్ ఎవరంటే…!