Home » సిల్క్ స్మిత చనిపోయినప్పుడు వెళ్లిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా..?

సిల్క్ స్మిత చనిపోయినప్పుడు వెళ్లిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన పర్ఫామెన్స్ తో స్టార్ నటిగా ఎదిగింది సిల్క్ స్మిత. ఒకప్పుడు ఈమె డేట్స్ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసేవారంటే ఆమె ఎంతటి గుర్తింపు సాధించిందో మనందరికీ తెలుసు. అలాంటి సిల్క్ స్మిత సినిమా వచ్చింది అంటే థియేటర్లు మొత్తం జనాలతో నిండిపోయేవి. తన అంద చందాలతో స్పెషల్ సాంగ్స్ తో మత్తు కళ్ళతో అందరినీ మెస్మరైజ్ చేసేది. అలా సిల్క్ స్మిత గురించి పూర్తి వివరాలు చూద్దాం.. సిల్క్ స్మితకు చిన్న ఏజ్ లోనే పెళ్లి చేశారు తల్లిదండ్రులు.

also read:భార్యాభర్తలు ఆ ఒక్క కార్యం చేయకపోతే..5 అనర్ధాలు తప్పవు..!!

Advertisement

కానీ భర్త వేధింపులు తట్టుకోలేక తన పిన్ని గారి ఇంటికి వెళ్ళింది. తన పిన్నితో కలిసి మద్రాసులో అడుగు పెట్టింది. అలా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్టుగా కెరియర్ ప్రారంభించిన ఆమె ఒక డైరెక్టర్ వల్ల ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది. మొదటిగా సైడ్ డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన స్మిత, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ కు కేరాప్ అడ్రస్ గా మారింది. ఇలా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ డం సంపాదించుకున్న సిల్క్ స్మిత ప్రేమలో మోసపోయింది. బ్రేకప్ అయింది.

Advertisement

also read:BIG BOSSలోకి ఉదయభాను ఎవరితో కలిసి ఎంట్రీ ఇస్తుందో తెలుసా..?

చివరికి మద్యానికి బానిసై సినిమా ఆఫర్లు తగ్గడంతో మానసిక ఆందోళనకు గురై ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఇలా ఇండస్ట్రీలో ఆమె పాట ఉంటేనే సినిమా హిట్ అవుతుందని ఆమెతో స్పెషల్ సాంగ్స్ చేయించుకొని ఎంతో సంపాదించుకున్న దర్శక నిర్మాతలు హీరోలు ఆమె చివరి క్షణాల్లో మరణించిన తర్వాత కనీసం చూడడానికి కూడా రాలేదు. కానీ ఆ ఒక్క స్టార్ హీరో మాత్రం ఆమె అంతిమ సంస్కారాలకు వచ్చారట. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే కన్నడ హీరో అర్జున్. ఆయన ఒక్కరు మాత్రమే ఆమె చనిపోతే చూడడానికి వచ్చారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

also read:నటుడు శరత్ బాబు గురించి ఎవరికీ తెలియని రహస్యాలు..!!

Visitors Are Also Reading