Home » సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

by Anji
Ad

 సీనియర్  ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమా రంగంలో, రాజకీయ రంగాల్లో ఏ రంగంలోనైనా ఆయన ఎలా రాణించారో అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం  జనరేషన్ కు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుసు. కానీ సీనియర్  ఎన్టీఆర్ అంటే ఓ బ్రాండ్ నేమ్.  జూనియర్ ఎన్టీఆర్ ని సైతం  తాత సీనియర్ ఎన్టీఆర్ తీసుకువచ్చారని చెప్పవచ్చు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రాండ్. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి గొప్ప ధీరుడు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది సినిమాల్లో సెట్ అయ్యారు రాజకీయాల్లో కూడా సెట్ అయిపోయారు.

Advertisement

అలాంటి సీనియర్ ఎన్టీఆర్ సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ తో ఒక వ్యక్తి ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనేది చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరయ్యా అంటే హైదరాబాదులోని అత్యంత ధనిక ప్రాంతమైనటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.   తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని హైదర్ గూడాలో ఈయన పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేసి 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

1985 నుంచి 92 దాకా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 1987- 88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా కూడా కొనసాగారు. అలాగే 2014లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత గోపీనాథ్ టీఆర్ఎస్  పార్టీలో చేరారు. 2018 లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2018 శాసనసభ పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇలా అంచలంచలుగా ఎదిగిన గోపినాథ్ కు ఎన్టీఆర్ స్ఫూర్తి అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading