Home » పాపం ప్రభాస్ దానినుండి ఎప్పుడు కోలుకుంటారో.. ఏమో..?

పాపం ప్రభాస్ దానినుండి ఎప్పుడు కోలుకుంటారో.. ఏమో..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలోనే ప్రభాస్ అతి పెద్ద స్టార్ హీరోగా ఎదిగారు. పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నారు.. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.. అలాంటి ప్రభాస్ గురించి ఆయన ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో డార్లింగ్ మోకాలికి సర్జరీ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆయన దాని నుండి పూర్తిగా కోలుకోలేదని అర్థమవుతోంది.. ప్రభాస్ నటించిన ఆది పురష్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఆదివారం మేకర్స్ విడుదల చేశారు.. అయోధ్య లో ఒక గ్రౌండ్ లో జరిగిన ఈవెంట్ కు ప్రభాస్ తో పాటు హీరోయిన్ కృతిసనన్, డైరెక్టర్ ఓం రౌత్ హాజరయ్యారు..

Advertisement

also read:భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయరాదు.. ఎందుకో తెలుసా..?

అయితే ఈ టీజర్ లాంచ్ సమయంలో ప్రభాస్ ర్యాంపుపై నడిచేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. హాఫ్ ఫీట్ హైట్ కూడా లేని స్టెప్స్ దిగడానికి కృతి సనన్ డైరెక్టర్ సహాయం తీసుకున్నారు. ఎందుకని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. దీంతో డార్లింగ్ ఇంకా మోకాలి గాయం నుంచి కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ మధ్య కాలంలోనే స్పెయిన్ దేశానికి వెళ్లి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. డాక్టర్ల సూచన మేరకు ఆయన రెస్ట్ కూడా తీసుకున్నారని, ఆ సమయంలో సినిమా షూటింగ్ ను కూడా పక్కన పెట్టేశారు అని తెలుస్తోంది.

Advertisement

అయితే ఇటీవల పెద నాన్న కృష్ణంరాజు చనిపోయి, పూర్తయిన తర్వాత ప్రభాస్ మూవీస్ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ స్టూడియో లో సంబంధించిన షెడ్యూల్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ప్రభాస్ గాయం నుంచి కోలుకుని మామూలు అయ్యారని ఫ్యాన్స్ భావించారు.. కానీ ఈ టీజర్ రిలీజ్ రోజు మాత్రం ఆయన ఇబ్బంది గా నడవడం చూసి కంగారు పడుతున్నారు.. డార్లింగ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఫ్యాన్స్ లో కొన్ని ఆలోచనలు రేకెత్తించాయని అర్థమవుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకొని పూర్తిగా ఆ గాయం నుంచి బయటపడి ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

also read:హీరో బాలయ్య భయపడేది ఆవిడకు మాత్రమే..ఆమె శాసించిందంటే చేయాల్సిందే మరీ..!!

Visitors Are Also Reading