పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాలిటిక్స్ కే సమయం కేటాయిస్తున్నారు. ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యమవుతూ వస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర యూనిట్ సెట్స్ మీద సందడి చేస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ముఖ్యమైన సీన్ షూట్ చేస్తున్నారట. బాలయ్య సినిమా షూటింగ్ కూడా అక్కడే జరగడంతో ఇటీవల పవన్ కళ్యాణ్, బాలయ్య సెట్స్ పై కలుసుకున్న విషయం తెలిసిందే. హరిహరవీరమల్లు సినిమా 17వ శతాబ్దానికి చెందిన కథ అని తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్ తన భార్యని ఏమని పిలుస్తాడో తెలుసా ? సీక్రెట్ బయటపెట్టిన స్నేహారెడ్డి..!
We are elated to welcome one of the biggest action stars of Indian Cinema and an actor par excellence, @thedeol into our #HariHaraVeeraMallu world.
Advertisement
▶️ https://t.co/9kRUBEHAlS pic.twitter.com/A892gEGo01
— Mega Surya Production (@MegaSuryaProd) December 24, 2022
ఈ కాలాన్ని ప్రతిబింబింబే విధంగా భారీ సెట్స్ కూడా ఉండబోతున్నాయట. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు పాత్ర కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ పాత్రను పోషించేందుకు బాలీవుడ్ నటుడు హైదరాబాద్ కి వచ్చారు. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ చారిత్రాత్మక చిత్ర బృందంలో జాయిన్ అయ్యారు. ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన చిత్రీకరణలో పాల్గొనడం కోసమే హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలకమైన సన్నివేశాలను దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. మరోవైపు బాబీ డియోల్ కి ఘనస్వాగతం పలుకుతూ హరిహరవీరమల్లు టీమ్ ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.
Also Read : కరోనా పై మరోసారి డీహెచ్ ఏమన్నారో వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!