Home » కరోనా పై మరోసారి డీహెచ్ ఏమన్నారో వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

కరోనా పై మరోసారి డీహెచ్ ఏమన్నారో వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

ప్రపంచ వ్యాప్తంగా మెల్లమెల్లగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. ప్రధానంగా చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ అయినటువంటి బీఎఫ్ 7 పంజా విసురుతోంది. కోట్లసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవించడం గమనార్హం. చైనాలో బీఎఫ్ 7 పీడిస్తున్న నేపథ్యంలో.. ఇటీవలే తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ముఖ్యంగా  ఏసుక్రీస్తు  కృపతోనే కరోనా తగ్గిందని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

Advertisement

తాజాగా యాదాద్రికి వెళ్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కరనా నూతన వేరియంట్ ని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో కరోనా పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని వెల్లడించారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా యాదాద్రిశుడి దయతో కరోనా మహమ్మారీని సమర్థవంతంగా ఎదుర్కున్నామని డీహెచ్ కీలక వ్యాఖ్యలు చేసారు.  

Advertisement

Also Read :   IPL 2023 : బాల్‌ కొనడానికి డబ్బుల్లేవ్‌.. కట్‌ చేస్తే ధోనీ టీంలోకి ఎంట్రీ..!

పోర్త్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నా మరణాల శాతం ఉండబోతుందన్నారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. రూ.1100 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని ప్రజలు మెచ్చేవిధంగా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు అని కొనియాడారు. బీఎఫ్ 7ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాం. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు అని, రెండేళ్లుగా యాదాద్రీశుడి దయతో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు డీహెచ్ శ్రీనివాసరావు. ముఖ్యంగా ఈయన ఎక్కడికి వెళ్లితే అక్కడ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు శ్రీనివాసరావుని ట్రోల్ చేస్తున్నారు. ఏసుక్రీస్తు గురించి, లక్ష్మీ నరసింహ స్వామి గురించి మాట్లాడిన పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. 

Also Read :  టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

 

Visitors Are Also Reading