పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ఓ వైపు తన నటనతో మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనుక ఆసక్తికరమైన స్టోరీ దాగి ఉంది. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ కుమార్. సినిమాల్లోకి రాకముందు తన రెండో అన్నయ్య నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మంచిన పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు. హీరోగా పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాకి ఈవీవీ సత్యానారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఆతరువాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత చేశారు పవన్ కళ్యాణ్. తమిళంలో హిట్ సాధించిన గోకులతై సీతై సినిమాకు ఇది రీమెక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది.
Advertisement
ఇది కూడా చదవండి : ఆ సమయంలో స్టేజీ మీద బోరున ఏడ్చేసిన ధన్‌రాజ్.. ఎందుకో తెలుసా..?
ఇక ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని మొదటిసారిగా విలేకర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని సంబోధించారు. ఇక ఆ తరువాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదుతో కథనాలు రాశాయి. గోకులంలో సీత సినిమా నుంచి కళ్యాణ్ కుమార్ కాస్త పవన్ కళ్యాణ్ కళ్యాన్ అయ్యాడు. ఆ తరువాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన సుస్వాగతం సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డు వేశారు. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు దర్శకులు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, రమేష్ వర్మ సినిమాలను లైన్‌లో పెట్టారు. హరిహర వీరమల్లు తప్ప మిగతా సినిమాలు మాత్రం ఎన్నికల తరువాతనే ఉండనున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది