Home » ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరో తెలుసా ? 

ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరో తెలుసా ? 

by Anji
Ad

ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతీ ఒక్కరి ముఖం, శరీరాకృతి ఒక్కో తీరులో ఉంటాయి. కానీ శాస్త్రీయంగా కొన్ని పద్దతుల్లో అందమైన వ్యక్తుల ముఖాలను గుర్తించవచ్చు అని పేర్కొంటున్నారు శాస్త్రవేత్తు. ఈ ఏడాది అందమైన వ్యక్తి ఎవరు అనేది కూడా తేల్చేసారు. బ్రిటీష్ నటుడు రెగె జీన్ పేజ్ ను అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించేశారు. ఇందుకోసం సంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్దతి గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ పై ని ఉపయోగించారు. దీంతో ఓ వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉన్నదో ఇలా లెక్కించవచ్చు. 

Advertisement

బ్రిటన్ కి చెందిన కాస్మిటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్ డ్ బ్యూటి పై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా రెగెజీన్ పేజ్ ని ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా గుర్తించారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియ ప్రకారం.. జీన్ పేజ్ కళ్లు, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు, దవడ, ముఖం వంటి అమరికను అంచెనా వేస్తారు. అలా ఇతని ముఖం 93.65 శాతం కచ్చితత్వంతో ఉన్నట్టు గుర్తించారు. తరువాత స్థానాలలో థోర్ సినిమాల్లో నటించిన క్రిస్ హెమ్స్ వర్త్ ( 93.53 శాతం) బ్లాక్ పాంథర్ నటుడు మిఖాయేల్ బి జోర్డాన్ (93.46 శాతం) సింగర్ హ్యారీ స్టైల్ (92.30 శాతం) ముఖాలు ఉన్నట్టు వెల్లడించారు.  

Advertisement

Also Read :   Hunt Review : సుధీర్ బాబు నమ్ముకున్న ట్విస్ట్ తో అలా జరిగిందా..?

Manam News

బ్యూటి పై మ్యాపింగ్ టెక్నిక్ లు ఒక వ్యక్తిని శారీరకంగా అందంగా ఉన్నాడనేందుకు అవసరమైన అంశాలను విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను వెల్లడిస్తాయి. మాకు శస్త్ర చికిత్సలు చేసే టప్పుడు ఉపయోగపడతాయి. ఇదే ప్రమాణాలను ఉపయోగించి రెగె జీన్ పేజ్ ని అందమైన వ్యక్తిగా గుర్తించాం. శాస్త్రీయంగా అతనికి అందమైన ముఖం, గోధుమ రంగు కళ్లు ఉన్నాయి. కళ్లు, పెదాలు కచ్చితమైన స్థానాల్లో ఉండడంతో అతని ముఖం అందమైన ముఖంగా పరీక్షలలో నిర్ధారణ అయింది అని డాక్టర్ జూనియన్ డి సిల్వా వెల్లడించారు.  

Also Read :  లోకేష్ యాత్రలో అపశ్రుతి…తారకరత్న కు గుండెపోటు….! ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ?

Visitors Are Also Reading