Home » Hunt Review : సుధీర్ బాబు నమ్ముకున్న ట్విస్ట్ తో అలా జరిగిందా..?

Hunt Review : సుధీర్ బాబు నమ్ముకున్న ట్విస్ట్ తో అలా జరిగిందా..?

by Anji
Ad

Hunt Review in Telugu: ప్రస్తుతం సినిమాల్లో ఏదైనా కొత్త అంశం ఉంటేనే ప్రేక్షకులు దానిని వీక్షిస్తున్నారు. పాత కథలను చాలా తక్కువగా ఆదరిస్తున్నారు. గతంలో కొత్త హీరోలు మాత్రమే కొత్త కథలను ఎంచుకునే వారు. ఇప్పుడు స్టార్ హీరోలు సైతం కొత్త కథలనే ఎంచుకుంటున్నారు. అందులో థ్రిల్లర్ కథలతో మెప్పించడం అంత సులభమైన విషయం ఏమి కాదు. ముఖ్యంగా ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత అంతర్జాతీయ సినిమాలను సైతం చూసి సరికొత్త విషయాలను తెలుసుకుంటున్నారు అభిమానులు. ముఖ్యంగా హాలీవుడ్ కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంది. థ్రిల్లర్ సినిమాలను తీయడంలో హాలీవుడ్ వారు ఎప్పుడో మాస్టర్లు అయిపోయారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నం చేస్తే.. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా ఉండాలి. లేదంటే అస్సలు వర్కవుట్ కాదు. ఇలాంటి కథలు టాలీవుడ్ లో జరుగుతున్నాయి. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తాజాగా  ‘హంట్’ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో ఉంటే ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తో సుధీర్ బాబుకి హిట్ పడిందా..? లేక ఆ ట్విస్ట్ అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Sudheer Babu Hunt Movie Review

Advertisement

సుధీర్ బాబు(అర్జున్), ఆర్యన్ (భరత్), మోహన్ (శ్రీకాంత్) ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ముగ్గురు మంచి స్నేహితులు. ఆర్యన్ ని ఎవరు చంపారని సుధీర్ బాబు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. దారులన్ని మూసుకుపోయిన ఈ కేసులో ఓ కీలకమైన ఆధారం సేకరిస్తాడు సుధీర్ బాబు. నిందితుడు ఎవరో అని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని శ్రీకాంత్ కి చెప్పేలోపే సుధీర్ బాబుకి యాక్సిడెంట్ జరుగుతుంది. గతం మరిచిపోతాడు. ఈ కేసు మొదటికే వస్తుంది. అర్జున్ మళ్లీ హ్యాండిల్ చేస్తాడు. ఈ కేసులో ఉన్నటువంటి నిందితుల గురించి, క్లూ ల తాను మోహన్ కి చెప్పాలనుకుంటాడు. అలా అన్ని మరిచిపోతాడు అర్జున్. వాటిని అర్జున్ ఎలా రీ కలెక్ట్ చేసుకున్నాడు..? చివరికీ నిందితుడిని పట్టుకున్నాడా లేదా అనేది ఈ సినిమా కథ. వాస్తవానికి మంచి పాయింట్ తో మొదలైంది ఈ కథ. 

ఒక పోలీస్ అధికారి తన స్నేహితుడు చనిపోవడం వెనుక వాస్తవాన్ని తెలుసుకొని .. కేసుని ముగించే సమయంలో ప్రమాదవశాత్తు గతం మరిచిపోయి ఆ కేసుని మళ్లీ తానే రీ ఓపెన్ చేయడం ఇది ఒక కొత్త పాయింటే. అయితే ప్రధానంగా ఎలా..? ఎవరు..? ఎందుకు..? అనే మూడు ప్రశ్నలకు సమాధానం కావాలి.. అనే డైలాగ్ ఉంటుంది. ఈ కథకి ఈ  మూడు అంశాలే కీలకం. ఆర్యన్ ని ఎలా చంపారు.. ఎవరు చంపారు..?  ఎందుకు చంపారు అనే మూడు ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలోనే కొనసాగుతుంది. సీన్ నెంబర్ వన్ నుంచే దర్శకుడు కథలోకి వెళ్లడం తెలివైన నిర్ణయం. సమయం వేస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ మోడ్ లో కొంత ఫ్లాష్ బ్యాక్ లో కొంత కథ నడుస్తుంది. ఆర్యన్-అర్జున్ మధ్య బాండింగ్ చూపించడానికి కొన్ని సీన్లు వాడుకొన్నాడు దర్శకుడు. 

Also Read :  అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్న సమంత…ప్రూఫ్ ఇదే…!

Advertisement

కొంత మంది అనుమానితులు తెరపైకి రావడంతో వాళ్లని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ప్రతీ ఒక్కరిపై అనుమానం బలపడుతుంటుంది. చివరికీ మరో కొత్త నిందితుడు తెరపైకి వస్తాడు. హంట్ సినిమా కూడా ఇదే తరహాలో కొనసాగింది. అయితే హంట్ సినిమాలో జరిగిన పొరపాటు ఏంటంటే.. తెరపై ఎంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా.. ప్రేక్షకులకు ఎవరిపైనా అనుమానం రాదు. వాందరూ అమాయకులుగానే కనిపిస్తారు. ఇంత చిన్న కారణానికి ఆర్యన్ అలా చంపేస్తారా అని తనకు తానే సమాధానపడి కుదుటపడుతాడు. హీరో మాత్రం వీళ్లే చంపారని బలంగా నమ్మి.. దాని చుట్టూ ఇన్వెస్టిగేషన్ నడుపుతుంటారు. థ్రిల్లర్ లో కీలకమైనటువంటిది  ట్విస్ట్ మీద ట్విస్ట్ లు ఎప్పుడు చాలా ఆసక్తిగా ఉండాలి. ఇంట్రవెల్ లో ఓ ట్విస్ట్ ఉంటే.. సెకండాఫ్ పై చాలా ఆసక్తి ఉంటుంది. 

Also Read :  ఈ సారి నాగార్జున ను టార్గెట్ చేసిన బాలయ్య..? ఆ కామెంట్స్ వెనక అర్థం ఏంటి..!

Manam News

కానీ ఇంట్రవెల్ లో ఎలాంటి ట్విస్ట్ లేకుండా అలాగే ఉండిపోవడం స్క్రీన్ ప్లే లోపమనే చెప్పాలి. హీరో పాత్రకి రెండు పార్శ్వాలుంటాయి. గతం మరిచిపోకముందు.. మరిచిపోయిన తరువాత..యాక్సిడెంట్ కి ముందు. తన అర్జున్ ఏ అనుకుంటే.. యాక్సిడెంట్ తరువాత బీ. అర్జున్ ఏకి, అర్జున్ బీకి ప్రవర్తనలో సున్నితమైన తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కశ్మీర్ లో ఎపిసోడ్ ని ఇంకాస్త పకడ్బందిగా తెరకెక్కిస్తే.. చాలా బాగుండేది. యాక్షన్ సీన్లు ఎక్కువే ఉన్నా.. వాటిని తెరకెక్కించిన విధానం చాలా సహజంగా ఉంది. ఈ చిత్రంలో దర్శకుడు, హీరో నమ్మింది కేవలం క్లైమాక్స్ ట్విస్ట్.  ప్రేక్షకుల మైండ్ సెట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందులో ఉన్న ట్విస్ట్ అద్భుతంగా ఉంది కానీ.. మనవాళ్లు అంతగా అప్ డేట్ అవ్వలేదు. అయినా.. దానిని నమ్మారంటే ఆ గట్స్ ని మెచ్చుకోవాల్సిందే. ఈ కథను హీరో సుధీర్ రిస్క్ చేశాడనే చెప్పాలి.  

Also Read :  chiranjeevi: అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ మూవీ..?

Manam News

పోలీస్ ఆఫీసర్ గా తన ఫిజిక్  సూపర్ సూట్ అయింది. క్యారెక్టర్ సీరియస్ నెస్ కూడా ఉన్నది. అయితే ప్రేమిస్తే భరత్ చాలా కాలం తరవాత ఈ సినిమాలో కనిపించాడు. తన పాత్ర డీసెంట్ గా ఉంది. శ్రీకాంత్ తన సీనియారిటీ చూపించాడనే చెప్పాలి. కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. చిన్న సినిమా కావడంతో.. పరిమితమైన బడ్జెట్ లో తీశారు. కానీ లోటు పాట్లు ఏం కనిపించవు. పైట్స్ ని సహజంగా తీయాలనే ఆలోచన బాగుంది. ఈ చిత్రంలో పాటలకు అంతగా స్కోప్ లేదు. ఒకే ఒక్క పాట ఉంటుంది. 2గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఈ సినిమాది. సినిమా స్లోగా సాగడం వల్ల మూడు గంటల పాటు సినిమా చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. ఇది రికేమా..? లేక ఫ్రీమేకా..? అనేది మాత్రం దర్శక, నిర్మాతలకే తెలియాలి. కేవలం క్లైమాక్స్ ట్విస్ట్ ని మాత్రమే నమ్ముకొని తీసిన సినిమా. ఆ ట్విస్ట్ లో ఉన్న తేడానే ఈ చిత్రం విజయాన్ని నిర్ణయిస్తుంది.  

Also Read :   Senior Actress Jamuna: టాలీవుడ్ లో మరో విషాదం..సీనియర్‌ నటి జమున కన్నుమూత

Visitors Are Also Reading