Home » NTR 30 లో హీరోయిన్, విలన్ ఎవరో తెలుసా ? 

NTR 30 లో హీరోయిన్, విలన్ ఎవరో తెలుసా ? 

by Anji
Ad

గత కొద్ది రోజుల నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా కోసమే సినిమా వర్గాలలో ఓ రేంజ్ లో చర్చగా నడుస్తుంది. మరి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. అనేది మంచి సస్పెన్స్ గా మారగా అంతకన్నా సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఆసక్తిగా మారింది.

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మంది పేర్లు మారి ఫైనల్ గా బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ కి వచ్చింది. ఈమెపై ఆల్రెడీ ఫోటో షూట్ కూడా పూర్తి అయిందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా టాక్ ఏంటంటే.. ఈ మాసివ్ ప్రాజెక్ట్ హీరోయిన్ గా జాన్వీకపూర్ నే ఫైనల్ అయిందట. అంతేకాదు.. దీంతో జాన్వీ టాలీవుడ్ డెబ్యూ ఫిక్స్ అని సినీ వర్గాల వారు అంటున్నారు. మరో అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో విలన్ గా తమిళ నుంచి స్టార్ హీరో విక్రమ్ అలాగే బాలీవుడ్ నుంచి సైఫ్ అలీఖాన్ ల పేర్లు వచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement

Also Read :   హీరోయిన్ దివ్య‌వాణి భ‌ర్త‌తో విడాకులు తీసుకుందా..? అస‌లు ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది..!

Manam News

మరివారిలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఎన్టీఆర్ సినిమాలో ఫిక్స్ అయినట్టుగా గట్టి ఇన్ఫో వినిపిస్తుంది. దీంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ విలన్ గా సైఫ్ లు ఖరారయ్యారు. సైఫ్ ఆల్రెడీ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ లో కూడా విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో తాను ఎలా ఉంటాడో చూడాల్సిందే. ఇంకా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు.  

Also Read :  హీరోల కొడుకులను బాబు అని పిలవడం వెనుక దాగి ఉన్న కథ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading