టాలీవుడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకుల ప్రకటించినప్పటి నుంచి సమంత వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటడ్ సినిమాల్లోనే నటిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం ఒకటి. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణ శేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తున్న ఈ సినిమాను పౌరాణిక ఇతిహాస ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నారు.
Advertisement
భారీ బడ్జెట్‌తో సెట్టింగ్స్‌లతో గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సమంత శాకుంతల దేవీ పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్రంలో సమంత జోడీగా నటిస్తున్న దుష్యంత మహారాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ పాత్రలో మలయాళ స్టార్ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఆదివారం దేవ్ మోహన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Also Read : బాలయ్య అన్ స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ తో పాటూ ఆ స్టార్ డైరెక్టర్..?
ముఖ్యంగా గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్న యువరాజు పాత్రలో దేవ్ మోహన్ ఆకట్టుకుంటున్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నీలిమా గుణ.. హ్యాపీ బర్త్ డే టూ అవర్ ఛార్మింగ్ అండ్ వాలియంట్ కింగ్ దుష్యంత్ అంటూ చిత్ర బృందం మోహన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ చాలా రోజుల తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Also Read : హీరోల భార్యల్లో ఆమెకు క్రేజ్ మామూలుగా లేదుగా..!