Home » రవితేజను మాస్ మహారాజా అని తొలిసారి పిలిచిన ఆ దర్శకుడు ఎవరో తెలుసా ?

రవితేజను మాస్ మహారాజా అని తొలిసారి పిలిచిన ఆ దర్శకుడు ఎవరో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అంతేకాదు.. దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు. 1997లో కృష్ణవంశీ దర్శకత్వంలో సింధూరం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఆ సినిమాలోని రవితేజ పాత్ర జనాలను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత హీరోగా పలు సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ లో మంచి బ్రేక్ రాలేదు. 

Advertisement

ఇక ఆ తరువాత 2002ల పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇడియట్ మూవీతో రవితేజ స్టార్ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. వరుస విజయాలతో స్టార్ డమ్ దక్కించుకున్నారు. ప్రతీ హీరోకు స్టార్ డమ్ వచ్చాక అభిమానంతో బిరుదులు ఇచ్చేస్తారు అభిమానులు.  రవితేజకు మాస్ మహారాజా అనే బిరుదును ఇచ్చేశారు. అయితే రవితేజకు మాస్ మహారాజా అనే ట్యాగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

గతంలో దర్శకుడు హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన షాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాదు.. ఈ సినిమాతో దర్శకుడిగా హరీశ్ శంకర్ కూడా స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారాడు. అయితే షాక్.. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు హరీశ్ శంకర్ ప్రతీ ఒక్కరినీ ఏదైనా ట్యాగ్ తో స్టేజ్ మీదకు పిలవాలని అనుకుంటున్నారట. అదే సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ రవితేజను మాస్ మహారాజా అని పిలిచారట. ఇక అప్పటి నుంచి రవితేజను తన అభిమానులు అందరూ మాస్ మహారాజా అని పిలవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ కూడా అలాగే పిలుస్తున్నారు. అలా రవితేజకు మాస్ మహారాజా బిరుదు వచ్చింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading