Home » నాగార్జున ‘శివ’ సినిమాని మిస్ చేసుకున్న క్రేజీ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

నాగార్జున ‘శివ’ సినిమాని మిస్ చేసుకున్న క్రేజీ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున నా సామిరంగ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇవాళ బిగ్ ఫినాలే జరుగుతున్న సమయంలో నాగార్జునకి సంబంధించిన ఓ  సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

తెలుగు సినిమాని కమర్షియల్ పరంగా, టెక్నికల్ పరంగా, టేకింగ్ పరంగా వేరే లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘శివ’.రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా ఇది. ఈ ఒక్క చిత్రం తో ఆయన వంద సినిమాలు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సంపాదించే క్రేజ్ ని సంపాదించాడు.ఈ సినిమాలో అనేక సన్నివేశాలకు రామ్ గోపాల్ వర్మ వాడిన కెమెరా యాంగిల్స్ మరియు షాట్స్ మేకింగ్ హాలీవుడ్ చిత్రాలలో కూడా ఏ డైరెక్టర్ తీయలేకపోయాడనే చెప్పాలి.  ఆ స్థాయి డైరెక్టర్ గా తనని తానూ నిరూపించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయనకీ బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. అక్కడ కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసి ప్రభంజనం సృష్టించాడు. ఇప్పుడు సందీప్ వంగ ఎలా అయితే సెన్సేషన్ ని క్రియేట్ చేసాడో.. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అలా అన్నమాట.

శివ చిత్రం కేవలం టెక్నికల్ గా మాత్రమే కాదు, టేకింగ్ పరంగా కూడా వేరే లెవెల్ అనిపించుకుంది.ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 5 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.అతి తక్కువ ప్రింట్స్ తో విడుదల అయ్యినప్పటికీ కూడా, ఈ సినిమా దాదాపుగా అన్నీ సెంటర్స్ లో గతం లో ఉన్న రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది.అయితే రామ్ గోపాల్ వర్మ అప్పటికే కొత్త డైరెక్టర్ కాబట్టి ఇతనితో సినిమా తియ్యడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదట. ముందుగా ఆయన ఈ కథని నాగార్జున కి వినిపించలేదు.అసలు ఈ కథకి ఆయన సరిపోతాడని కూడా అనుకోలేదట.ఎందుకంటే అప్పటి వరకు నాగార్జున రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి హీరోతో ఇంత మాస్ రోల్ అంటే బాగుండదేమో అనే ఫీలింగ్ ఉండేదట.

అందుకే ఈ కథని విక్టరీ వెంకటేష్ తో తియ్యాలని రామానాయుడు కి స్టోరీ ని వినిపించేందుకు గంటకి పైగా ఎదురు చూస్తూ ఉన్నాడు. రామానాయుడు కి స్టోరీ ని వినిపించాడు. ఆయన కూడా వెంకటేష్ ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నాడు కదా, ఇలాంటి కొత్త రకమైన టేకింగ్ తో తీసే సినిమాలు ఆడియన్స్ కి నచ్చుతుందో లేదో, వేరే హీరోకి ట్రై చేసుకో అని చెప్పాడట. అదే సమయంలో  నాగార్జున అయితే  ఈ కథకి సరిపోతాడు అని ఆయనే రికమెండ్ చేశాడట. రామానాయుడు స్థాయి వ్యక్తి చెప్పిన తర్వాత కలిసి స్టోరీ వినిపించకపోతే బాగుండదు అనుకొని వర్మ నాగార్జున దగ్గరికి వెళ్లి కథని వినిపించాడట. సింగల్ సిట్టింగ్ లోనే స్టోరీ ఓకే అయిపోయిందట. అలా వెంకటేష్ చేయాల్సిన శివ మూవీ నాగార్జున వద్దకు వెళ్లింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading