Home » బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా సౌత్ సినిమాలు నార్త్ సినిమాల కంటే ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించిన సినిమా బాహుబలి. ఇక ఈ సినిమాతోనే సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. బాహుబలి చిత్రం రెండు పార్ట్ లుగా వచ్చింది. బాహుబలి చిత్రంలో బాహుబలి, బళ్లాలదేవుడు తరువాత ముఖ్యమైన పాత్ర కట్టప్ప పాత్ర ఒకటి. 

Advertisement

బాహుబలి పక్కనే ఎంతో నమ్మకంగా ఉండే కరికాల కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు. అలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ.. ఫస్ట్ పార్ట్ కి ఎండింగ్ ఇచ్చాడు జక్కన్న. ఇక రెండో పార్ట్ లో కూడా కట్టప్ప పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టే ఈ పాత్ర కోసం తొలుత రాజమౌళి మలయాళ నటుడు మోహన్ లాల్ ని సంప్రదించారట. అయితే ఆ క్యారెక్టర్ మోహన్ లాల్ కి  నచ్చక దానిని రిజెక్ట్ చేశాడట. 

Advertisement

Also Read :  గుర్తు పట్టలేనంత మారిపోయిన ఆది సినిమా హీరోయిన్…ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

 Mohan Lal Was The First Choice For Bahubali Movie Kattapa Character Details, Moh-TeluguStop.com

బాహుబలి చిత్రం విడుదల తరువాత సత్యరాజ్ పోషించిన ఆ పాత్రకి చాలా రెస్పాన్స్ వచ్చింది. దీంతో మోహన్ లాల్ కూడా ఈ పాత్ర చేస్తే ఇంకా హైలెట్ గా ఉండేదని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. కేవలం మోహన్ లాల్ మాత్రమే కాదు.. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో ఏ చిన్న అవకాశమొచ్చిన చేసే ఉద్దేశంలో చాలా మంది ఆర్టిస్టులున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి పాన్ ఇండియా అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేర్గాంచారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు జక్కన్న. ఇక రాజమౌళి సినిమాలో నటిస్తే ఓ పదేళ్ల వరకు వారికి ఇండస్ట్రీలో డోకా లేకుండా ఉంటుందని అందరూ దర్శక ధీరుడు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురుచూస్తున్నారు. 

Also Read :  అల్లు అర్జున్ భార్య పై మామ అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్…!

Visitors Are Also Reading