Home » MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

by Bunty

టీమిండియా మ్యాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా కు ఎవరు సాధించలేని విజయాలను అందించి పెట్టాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటికే మూడు ఐసీసీ టోర్నమెంట్ లను టీమిండియా కు అందించి.. శభాష్ అనిపించాడు ధోని. 2007 సంవత్సరంలో జరిగిన టి20 ప్రపంచ కప్, 2011 సంవత్సరంలో జరిగిన వన్డే ప్రపంచ కప్, అలాగే 2013లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీని కూడా తన కెప్టెన్సీలో టీమిండియా కు అందించాడు.

అనంతరం 2020 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన మహేంద్రసింగ్ ధోని… ఇప్పటికీ ఐపిఎల్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. ఆటో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్రసింగ్ ధోని… ఆ జట్టుకు కూడా ఏకంగా ఐదు ఐపిఎల్ టోర్నమెంట్లను అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని కుటుంబం గురించి మనకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. ధోనీకి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ధోని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తన బయోపిక్ లో కూడా ఎవరికి చూపించలేదు ధోని. అయితే మహేంద్రసింగ్ ధోని.. అన్నయ్య పేరు నరేంద్ర సింగ్ ధోని.

తాజాగా ధోని బైక్స్ కలెక్షన్స్ గురించి.. వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో… అతని అన్న గురించి ఇప్పుడు తెరపైకి వచ్చింది. కాగా ధోని అన్న అయిన నరేంద్ర సింగ్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2013 సంవత్సరంలో సమాజ్వాది పార్టీలో ఆయన చేరారు. అంతకుముందు… బిజెపి పార్టీలో కూడా పనిచేశారు నరేంద్ర సింగ్ ధోని. ఇక 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న నరేంద్ర సింగ్ ధోనికి ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ధోని అన్నయ్య నరేంద్ర సింగ్ అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం బయటకు రావడంతో… 1000 కోట్ల ఆదాయం ఉన్న ధోని… తన అన్నను ఎందుకు ఆదుకోవడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

Visitors Are Also Reading