Home » ఇండియా – పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్లూ

ఇండియా – పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్లూ

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఈ ఏడాది మన ఇండియాలో జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఇప్పటికే ఈ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఐసీసీ. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుంది.

Advertisement

ఇక అక్టోబర్ 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై అందరికీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ చూసేందుకు… ఇప్పటి నుంచే అక్కడ హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Advertisement

ఇప్పటికే చాలామంది హోటల్ రూమ్స్ బుక్ చేసుకోగా.. ఇదే అదునుగా ఒక్క రూమ్… ఒక్క రాత్రికి లక్ష వరకు వసూలు చేస్తున్నారు హోటల్ యజమానులు. ఓయో రూములు, ఇతర హోటల్లు అన్ని ఇప్పటికే ఫుల్ అయ్యాయట. దీంతో ఫాన్స్ చాలా తెలివిగా ఆలోచించి… కార్పొరేట్ ఆసుపత్రిలో.. ఫుల్ బాడీ చెకప్, ఓవర్ నైట్ స్టే బుక్ చేసుకుంటున్నారు. దీంతో తక్కువ రేటుకే ఆసుపత్రి బెడ్లను పొందుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే.. ఈ విషయం కూడా వెలుగులోకి రావడంతో.. ఆస్పత్రి యాజమాన్యాలు కూడా విపరీతంగా రేట్లను పెంచుతున్నారట.

ఇవి కూడా చదవండి

40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉండిపోయిన హీరోయిన్స్ !

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading