జగపతి బాబు హీరోగా నటించిన శుభలగ్నం మూవీ 1994లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో జగపతిబాబు, ఆమని భార్య, భర్తలుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. డబ్బు, సంతోషం అనే అంశం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది.
Advertisement
మధ్య తరగతి జీవితం పట్ల అసంతృప్తి చెంది, మరింత సంపదను కోరుకునే అత్యాశగల భార్య పాత్రలో నటించింది ఆమని. జగపతి బాబు ప్రేమ గల భర్తగా ఆమె కోరికలు తీర్చడానికి ప్రయత్నించి ఆమెను సంతోషపెట్టడంలో విఫలం చెందాడు. ఆమె గొంతమ్మ కోరికలు తీర్చలేక జగపతి బాబు చివరికీ ఓ నిర్ణయానికి వస్తాడు.
ధనవంతురాలు, ఉదారంగా ఉండే రోజాను పెళ్లి చేసుకున్నట్టు నటిస్తూ ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఈ సినిమా సెకండాఫ్ లో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. దీనిని రచయిత, నటుడు దివాకర్ బాబు చాలా ఆలోచించి రాశాడు. ఆమని తన భర్తను రోజాకి ఇచ్చి పెళ్లి చేస్తే.. భారీ సంపద వస్తుందని భావించే అలాగే చేస్తుంది.
అయితే రోజా తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా ఉండటం చూసి ఆమె తన తప్పును తెలుసుకుంటుంది. ఆమె అతడిని తిరిగి గెలవడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఎన్నో ట్విస్ట్ లను దివాకర్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కలిసి రాసుకున్నారు. తొలుత ఈ ట్విస్టులు లేక వారు సినిమా ఫ్లాప్ అవుతుందని కాస్త ఆందోళన పడ్డారట. అందుకే చాలా సేపు ఆలోచించి ఆమని క్యారెక్టర్ కి డబ్బు ఆశ ఉండేవిధంగా రాసుకున్నారు.
Advertisement
అంతేకాదు.. డబ్బుపై ఆశతో భార్య చివరికీ భర్తను కూడా అమ్ముకుంటుందనే పాయింట్ ని రైటర్ దివాకర్ దర్శకుడు కృష్ణారెడ్డికి చెప్పాడట. ఇక ఈ పాయింట్ బాగా నచ్చడంతో దానిని ఎస్వీ కృష్ణారెడ్డి హైలెట్ చేశాడు. జగపతి బాబు తన భార్యగా ఎవ్వరినీ ఎంచుకుంటాడనే ఉత్కంఠతో ప్రేక్షకులను క్లైమాక్స్ బాగా ఆకట్టుకుంటుంది. జీవితంలో కేవలం డబ్బే ప్రాధాన్యం కాదు.. మనం ప్రేమించే వారితో కలిసి ఉండటం వల్ల అసలైన సంతోషం కలుగుతుందనే నైతిక సందేశాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. ఈ మూవీలో జగపతి బాబు, ఆమని, రోజా వారి పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ఆమనికి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. బెస్ట్ దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకుల ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలో వస్తే కన్నార్పకుండా చూస్తారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :