Home » శంకర్ దాదా MBBS మూవీలో ATM క్యారెక్టర్‌ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

శంకర్ దాదా MBBS మూవీలో ATM క్యారెక్టర్‌ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఖైదీ సినిమా చిరంజీవికి మంచి ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఆ తరువాత ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలతో మెగాస్టార్ రేంజ్ పెరిగిపోయింది. ప్రధానంగా ఇంద్ర, ఠాగూర్ వంటి యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో  ప్రేక్షకులను వినోదభరితంగా ఆహ్లాదపరిచి చేసిన చిత్రం శంకర్ దాదా MMBS. మానసిక రోగాన్ని ప్రేమతోనే నయం చేయగలం అనే మెసేజ్ తో అప్పట్లో వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను  ఆకట్టుకుంది.

Advertisement

 మెగా స్టార్ కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. పరేష్ రావల్, చిరంజీవికి మధ్య జరిగిన లింగంమాయ్య అంటూ సాగే కామెడీ సంభాషణ ఈ చిత్రానికి  హైలెట్ గా నిలిచింది. చిట్టిగా హీరోయిన్ సోనాలి బింద్రే కూడా శంకర్ దాదా ను ఆటపట్టించడం అందరినీ ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ అందరినీ ఎంతగానో అల‌రిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవితోపాటు హీరో శ్రీకాంత్ నటించిన ATM పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు ATM గా శ్రీకాంత్ పాత్ర బాగా గుర్తుండిపోతుంది. శంకర్ దాదా MBBS చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో కూడా ATM గా హీరో శ్రీకాంత్ నటించారు. ఈ రెండు చిత్రాలు కూడా హిందీలో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ MBBS చిత్రానికి అనువాదంగా  తెలుగులో చిరంజీవి చేశారు. 

Advertisement

ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  ఈ చిత్రంలో ATM పాత్రను చిరంజీవి ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంతో సక్సెస్ సాధించి వరుస  ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలో ఏటీఎం క్యారెక్టర్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయనను దూరం పెట్టారని వెల్లడించారు శ్రీకాంత్. అంతేకాదు.. అప్పటికే పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటంతో.. శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో నా పేరే కాంచనమాల సాంగ్ లో చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చార‌ని తెలిపారు. ఈ మధ్య కాలంలో విలన్ గా, హీరోకి అన్నగా, తండ్రిగా, బాబాయ్ గా ఇలా రకరకాల పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు శ్రీకాంత్.  ఇటీవలే బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీలో కీలక పాత్ర పోషించారు శ్రీకాంత్. 

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading