Home » చికెన్‌తో పాటు ఏయే ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకోకూడ‌దో మీకు తెలుసా..?

చికెన్‌తో పాటు ఏయే ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకోకూడ‌దో మీకు తెలుసా..?

by Anji
Ad

భారతదేశంలో మాంసాహార ప్రియులు అధిక శాతం ఉన్నారు. దాదాపు 70 శాతం పైగా దేశ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా నాన్‌వెజ్ తీసుకుంటారు. అందులో ఎక్కువగా చికెన్ తీసుకుంటారు. ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఎక్కువగా బీఫ్ తింటారు. ఆహారం తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం తప్పనిసరి. తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. చికెన్ తో పాటు చాలా మందికి కొన్ని రకాల పదార్థాలు తినడం చిన్నప్పటి నుంచే అలవాటు. చికెన్ తో పాటు కొన్ని రకాల పదార్ధాలు తింటుంటారు. అయితే అందులోకొన్నింటిని మాత్రం అస్సలు తీసుకోకూడదు. చికెన్ తో పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు..? ఒకవేళ అలా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సాధారణంగా చాలామంది చికెన్, మటన్, ఫిష్ వంటివి కలిపి ఒకేసారి తీసుకుంటారు. అయితే చికెన్ తినేటప్పుడు మాత్రం ఫిష్ మాత్రం అసలు తినకూడదట. ముఖ్యంగా చికెన్ లో ప్రోటీన్స్ ఉండ‌డం, ఫిష్ లో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఇబ్బందులు ఇబ్బందులు త‌లెత్తె అవ‌కాశం ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చికెన్ తినేట‌ప్పుడు ఎప్పుడు కూడా చేపలను అస్సలు తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అన్నంలో చికెన్ లేదా మసాలా ఉన్నటువంటి క‌ర్రీస్‌ ఏవైనా తిన్న తర్వాత చాలామందికి చివరలో పెరుగు అన్నం తినే అలవాటు త‌ప్ప‌కుండా ఉంటుంది.

Advertisement

Also Read: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు ఆమె కళ్ళు పట్టుకొని ఎందుకు ఏడ్చాడు ?

అయితే చికెన్ తిన్న త‌రువాత‌ లేదా చికెన్ తో పాటు పెరుగును కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకన‌గా..? చికెన్ తిన్నప్పుడు శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. ఇక అదే సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల చ‌ల్ల‌ద‌నం అవుతుంది. ఒకే స‌మ‌యంలో వేడి, చల్లదనం రెండు శరీరానికి అందినప్పుడు నెగిటివ్ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం పెరుగుతో మాత్రమే కాకుండా చికెన్ తినే సమయంలో పాలు కూడా తీసుకోకూడ‌దు. పాలు తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. చికెన్, పాలు రెండు కలిపి తీసుకుంటే మాత్రం విషం తీసుకున్నట్టే లెక్క. అందుకే ఎట్టి పరిస్థితుల్లో చికెన్ తిన్నప్పుడు పాల‌ను మాత్రం అస్సలు తీసుకోకండి. ఈ కాంబినేషన్ తీసుకొని ఇబ్బంది పడే కన్నా అసలు తీసుకోకపోవడం ఎంతో మంచిది.

Visitors Are Also Reading