Home » ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణించ‌డానికి ముందు ఆ సీనియ‌ర్ న‌టి కాళ్లు ప‌ట్టుకుని ఏం చెప్పాడో తెలుసా..?

ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణించ‌డానికి ముందు ఆ సీనియ‌ర్ న‌టి కాళ్లు ప‌ట్టుకుని ఏం చెప్పాడో తెలుసా..?

by Anji
Ad

ఉద‌య్ కిర‌ణ్ అంటే తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ముందుగా గుర్త‌కొచ్చేది చిత్రం సినిమా అనే చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా ద్వారా ఉద‌య్ కిర‌ణ్ తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద హీరో స్థాయికి ఎదిగాడు. ఉద‌య్ కిర‌ణ్‌కు అభిమానుల్లో అమ్మాయిలే ఎక్కువ‌గ ఉండేవారు. అత‌ను ల‌వ‌ర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఉద‌య్ కిర‌ణ్ 1980 జూన్ 26 హైద‌రాబాద్ జ‌న్మించాడు. తెలుగు, త‌మిళ భాష చిత్రాల్లో ప్ర‌సిద్ధ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ముఖ్యంగా తెలుగులో హీరోగా న‌టించిన తొలి మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ సాధించాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో ఉద‌య్ కిర‌ణ్ హ్యాట్రిక్ సాధించిన న‌టుడిగా బిరుదు సంపాదించుకున్నాడు. ఉద‌య్ కిర‌ణ్‌- తేజ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన సినిమా చిత్రం. ఈ సినిమా హిట్ అవ్వ‌డంత పాటు ఆ త‌రువాత వ‌చ్చిన నువ్వు నేను, మ‌న‌సంతా నువ్వే సినిమాలు వ‌రుస‌గా హిట్ కావ‌డానికి ఈ సినిమా ఎంతో ఉప‌యోగప‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Advertisement

ఇక 2001లో ఉద‌య్ కిర‌ణ్‌కి నువ్వునేను సినిమాకి ఫిలింఫేర్ అవార్డు వ‌రించింది. 2005లో పాయ్ అనే సినిమా ద్వారా బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించాడు. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల కొన్ని సినిమాలు విడుద‌ల కాలేదు. రాను రాను ఉద‌య్ కిర‌ణ్ ఎంత ఎత్తుకు ఎదిగాడో అంత కిందికి ప‌డిపోయాడు. ఉద‌య్ కిర‌ణ్‌కి సినిమా అవ‌కాశాలు రాక చాలా ప్రాబ్ల‌మ్స్ లో కూరుకుపోయిన మ‌న‌స్థాపానికి గురై ఈ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకోలేక చివ‌రికీ సూసైడ్ చేసుకున్నాడు. ఉద‌య్ కిర‌ణ్ కి ఎక్కువ చిత్రాల్లో త‌ల్లిగా న‌టించిన సుధా ఓ ఇంట‌ర్వ్యూలో ఉద‌య్ కిర‌ణ్‌కి సంబంధించిన కీల‌క విష‌యాల‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణానికి సంబంధించి కార‌ణాలు ఏమై ఉంటాయ‌ని ఓ యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అత‌ను మాన‌సిక మైన క్షోభ అనుభ‌వించి ఉంటాడ‌ని చెప్పింది. దానికి కార‌ణం ఎవ్వ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేన‌ని వెల్ల‌డించింది.

Advertisement

ముఖ్యంగా ఉద‌య్ కిర‌ణ్ అంద‌రి లాంటి వాడు కాద‌ని.. త‌న‌ను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా ఎవ్వ‌రికీ కూడా చెప్పుకోకుండా లోలోప‌ల‌నే బాధ‌ను అభ‌వించి ఉంటాడ‌ని అందుకే సూసైడ్ చేసుకుని ఉంటాడ‌ని సుధా ఎమోష‌న్ తో చెప్పి క‌న్నీరు పెట్టుకుంది. ఎవ‌రైనా ఓదార్చిన‌ప్పుడు మాత్ర‌మే మంచిగా ఉండేవాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ య‌ధావిధి స్థానానికి వ‌చ్చి బాధ‌ప‌డేవాడు. ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణించ‌డానికంటే రెండు నెల‌ల ముందు నేను ద‌త్త‌త తీసుకోవాల‌నుకున్నాను. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల తీసుకోలేక‌పోయాను. ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణించ‌డానికి ముందు చివ‌రి రోజుల్లో నా ద‌గ్గ‌రికి వ‌చ్చి కాళ్లు ప‌ట్టుకొని గ‌ట్టిగా ఏడ్చాడు. నేను ఒక్క‌డినే ఒంట‌రి వాడిని అయ్యానని బోరున విలపించాడు. అత‌నికి నేను ధైర్యం చెప్పాను. నీకు నేను ఉన్నాను నీకు మంచి వ్యాపారం చూపిస్తాన‌ని చెప్పి ఓదార్చాను. కానీ ఉద‌య్ కిర‌ణ్ నా మాట వినిపించుకోలేదు అని.. ఇప్పుడు కాన‌రాని లోకాల‌కు వెళ్లాడంటూ సుధా ఏడ్చేసింది.

Also Read : 

అల్లుఅర్జున్ మ‌రో రికార్డు.. పుష్ప‌తో ఫ‌స్ట్ ఇండియ‌న్ హీరోగా ఘ‌న‌త

నమ్మక ద్రోహం చేసేవాళ్ళ లక్షణాలు ఇవేనేట….ఎలా గుర్తుపట్టాలంటే…?

 

Visitors Are Also Reading