అది యూట్యూబర్ల గ్రామం.. అక్కడ జనాభా కేవలం 300 మంది. వారిలో వెయ్యి మందికి పైగా యూబర్లున్నారు. ఆ ఊరి సర్పంచ్ కూడా యూట్యూబర్లకు గ్రామపంచాయతీ తరుపున సహాయం చేస్తున్నారు. వారిని వెన్నుతట్టి మరీ ప్రోత్సహిస్తున్నారు. దేశమంతా చర్చకు వచ్చిన ఆ విలేజీ ఎక్కడుంది ? ఆ విలేజ విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ ఎంట్రీ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Advertisement
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ జిల్ా తహసీల్ లోని తులసి గ్రామం. ఆ ఊరి సర్పంచ్ గులాబ్ యాదవ్ యూట్యూబర్లకు అండగా నిలుస్తున్నాడు. దీంతో ఈ గ్రామానికీ చెంది యూట్యూబర్లు దేశాన్ని, ప్రపంచాన్ని అలరించే కంటెంట్ సృష్టిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం కూడా అంతంత మాత్రంగానే ఉండేటటువంటి తులసి గ్రామంలో యూట్యూబర్ల సమాచార విప్లవం యావద్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ గ్రామంలో అందరూ ఎందుకు వీడియోలు చేస్తున్నారో తొలుత అర్థం కాలేదని గ్రామ సర్పంచ్ గులాబ్ యాదవ్ పేర్కొన్నారు. మెల్ల మెల్లగా అన్నీ అర్థమవ్వడంతో డబ్బు, కారు, లొకేషన్లు ఏర్పాటు చేయడం ప్రారంభించాం. యూట్యూబర్లకు అవసరమైన అన్ని సహాయాలను వారికి అందించాం. గ్రామంలోని ప్రతీ ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు అని చెప్పారు.
Advertisement
Also Read : నాగచైతన్య-శోభిత గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన సమంత..!
కంటెంట్ క్రియేషనర్ ఇప్పుడు పూర్తి సమయం వృత్తిగా మారినందున తులసి గ్రామ యూట్యూబర్లు దీనిని అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కెమెస్ట్రీలో ఎంఎస్సీ చేసిన జైవర్మ ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో పార్ట్ టైమ్ టీచర్ గా పని చేశాడు. అతను కేవలం నెలకు రూ.12వేలు మాత్రమే సంపాదించాడు. కానీ యూట్యూబ్ లో అతనికి ప్రతీ నెల సుమారు రూ.30నుంచి 35 వేల వరకు వస్తున్నాయి. ఊరిలోని ఇలాంటి వారి అడుగు జాడలను అనుసరించి ఇతరులు కూడా యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించారు. మహిళా కళాకారిణి పింకి సాహూ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఏడాదిన్నర గడిచింది. ఈ ఊరి నుంచి నుంచి ప్రసామవుతున్న బీయింగ్ ఛత్తీస్ ఘడ్ అనే యూట్యూబ్ ఛానెల్ కి 115 సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ 200కి పైగా కామెడీ వీడియోలను రూపొందించింది. వీరు కామెడీ వీడియోలతో ప్రజలను నవ్విస్తూ ముందుకు సాగుతున్నారు.
Also Read : మస్కిటో కాయిల్ పొగ పీల్చి… ఆరుగురు మృతి… వీటిని వాడటం అంత ప్రమాదమా!