Home » ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా ?

ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా ?

by Anji
Ad

రోజు రోజుకు ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా రోబోటిక్ ఎంట్రీ అయింది.  ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలోకి కూడా రోబోటిక్ మిషన్ రావడంతో నిర్మాణ పనులు చక చక్క జరుగుతున్నాయి. గుడి, బడి ఇల్లు ఇలా ఏ నిర్మాణం చేపట్టాలన్నా.. ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు. సామాగ్రి కూలీలు అందుబాటులో ఉన్నప్పటికీ.. నిర్మాణం పూర్తి అవ్వాలంటే నెలలు గడవాల్సిందే.. ఈ కష్టాలకు చెక్ పెడుతూ కేవలం గంటల వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తో ఆధ్యాత్మిక టెంపుల్స్ ని నిర్మిస్తున్నారు. 

Advertisement

తాజాగా సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి సమీపంలోని ఓ ప్రయివేటు విల్లాస్ వాళ్లు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తో మూడు ఆలయాలను నిర్మిస్తున్నారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సంప్లీ పోర్ట్ అనే త్రీడీ టెక్నాలజీతో మూడు ఆలయాలను నిర్మిస్తున్నారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్ట్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. ఈ త్రీడీ టెంపుల్ నిర్మాణంలో భాగంగా 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తుతో తొలుత వినాయక ఆలయం, ఆ తరువాత శివాలయం, ఆ తరువాత అమ్మవారి ఆలయాలు మూడింటిని పక్క పక్కనే నిర్మిస్తున్నారు. మాన్యువల్ గా మనుషులు తయారు చేయలేని డిజైన్ ని కంప్యూటర్ లో పొందు పరిచి ఆ డిజైన్ ని కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ త్రీడీ టెంపుల్స్ నిర్మాణం చేయడంలో ముఖ్య ఉద్దేశం.. అత్యంత టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ డిజైనింగ్ తో పాటు నిర్మాణం సమయం కూడా కలిసి రావడం.. తక్కువ మ్యాన్ పవర్తో అందమైన డిజైన్ రావడం వంటి అంశాల కారణంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ మిషన్ ని ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాప్ట్ వేర్ మొత్తాన్ని ఇండియాలోనే తయారు చేశారు. ఈ రోబోటిక్  తో భవన నిర్మాణాలు చేయడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి అంటున్నారు. పలు రకాల డిజైన్ల ద్వారా 3 డీ ప్రింటింగ్ చేయవచ్చు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అక్కడ త్వరగా ఇండ్లు కట్టాలన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. రోబోటిక్ మిషన్ ని మంచుకొండలు, ఎత్తైన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి బాగుంటుందంటున్నారు. దీని ద్వారా ఇండ్ల నిర్మాణం కూడా చేయవచ్చు. నెలలో వ్యవధిలో కట్టే ఇండ్లను కేవలం గంటల వ్యవధిలోనే పూర్తి చేయవచ్చు అంటున్నారు. నిర్మాణంలో దీని వాడటం వల్ల మెటీరియల్ చాలా తక్కువపడుతుంది అంటున్నారు. 

మరికొన్ని ముఖ్య వార్తలు : 

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారి ఆరోగ్యానికి డోకా ఉండదు

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ శుభవార్త చెప్పనున్నారా ?

ప్రభాస్ వర్షం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading