ఆచార్య చాణక్యుని గురించి అందరికీ తెలిసిందే. పూర్వకాలంలోనే అతను జీవితానికి సంబంధించిన విషయాలను ఎన్నో బోధించాడు. ఎంతో మంది రాజులకు సలహాలు ఇచ్చాడు. చాణక్యుడి ప్రకారం.. కొత్తగా పెళ్లైన భార్యభర్తల గురించి ఇలా చెప్పాడు. కొత్తలో భార్యభర్తల మధ్య బంధం అంతగా బలంగా ఉండదని.. ఒకరినొకరు తెలుసుకొని చిన్న చిన్న విషయాలకు ఇబ్బందులు, కోపాలు తెచ్చుకోకుండా మెలిగితే వారి వైవాహిక జీవితం సంతోషంగా సాపీగా సాగుతోందని చాణక్యనీతిలో చెప్పాడు.
Advertisement
ముఖ్యంగా పెళ్లి తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దంటే పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాలను వివరించాడు. ప్రేమ పెళ్లి చేసుకుంటే లవ్ చేసుకుంటున్న సమయంలోనే ఒకరికొకరు తెలుసుకుంటారు. ఒకవేళ పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే అలాంటి అవకాశముండదు. పెద్దలు ఎక్కువగా అమ్మాయి అయినా.. అబ్బాయికి అయినా గుణాలను ఎక్కువగా చూస్తుంటారు. ముఖ్యంగా పెద్దలు అందంకంటే ఎక్కువగా వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ నేటి కాలంలో అందానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం గమనార్హం.
Advertisement
అందం కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని చాణక్య చెప్పాడు. తన కోపమే తనకు శత్రువు అంటారు. అది అక్షరాల సత్యమనే చెప్పాలి. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోలేక ఏ సమస్య అయినా తీరిపోతుంది. ఎక్కువగా కోపం ఉన్న వారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. పెళ్లికి ముందు మీ యొక్క పార్ట్‌నర్ కోపం ఎలా ఉంటుందో పరీక్షించుకోవాలి. పెళ్లికి ముందు ఏ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తమ జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. 100 అబద్దాలు ఆడి అయిన ఒక పెళ్లి చేయాలంటారు.
కానీ ఇలా చేయడం ద్వారా ప్రస్తుత రోజుల్లో విభేదాలు వస్తున్నాయి. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటుంటారు. ఇలా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా గౌరవంగా ఉంటున్నారా..? ఇతరులతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటున్నారా అనేది చూసుకోవాలి. ఎందుకనగా ఎవరినైనా గౌరవించని వ్యక్తికి కూడా గౌరవం లభించదు. మనం ఒకటి ఇస్తే అది మనకు తిరిగి తప్పకుండా ఎప్పటికైనా లభిస్తుంది. రాబోయే పార్ట్‌నర్‌లో ఇటువంటి లక్షణాలు ఉన్నాయో లేవోతెలుసుకోవాలని చాణక్యుడు వివరించాడు.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది