Ad
ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది అంటే దానికి సంబంధించి ఎంతో ఖర్చు ఉంటుంది. అంతేకాదు హీరో,హీరోయిన్,క్యారెక్టర్ ఆర్టిస్టులు,విలన్లు ఇలా ఎంతోమంది నటీనటులకు సంబంధించి అనేక కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఈ జనరేషన్లో కాస్ట్యూమ్స్ కి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. కొత్త కొత్త కాస్ట్యూమ్స్ ప్రేక్షకులకు చూపించి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ సినిమాల్లో ధరించిన దుస్తులను వారితోనే జ్ఞాపకంగా తీసుకెళ్లేవారని సమాచారం. కానీ ఇప్పుడు అలాంటి ట్రెండ్ లేదు.
ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలైనా బాహుబలి,రుద్రమదేవి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు తెరికెక్కాయ్. ఈ చిత్రాల్లో ఎక్కువ మంది జనాల్ని చూపించడం కోసం ఎక్కువ కాస్ట్యూమ్స్ వాడారు. కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇతర నటీనటులు వేసుకునే కాస్ట్యూమ్స్ కి సాధారణ ప్రజలు ధరించే దుస్తులకు తేడా ఉంటుంది. ఇందులో ప్రధానమైన తేడా ధర. అగ్నిపర్వతం మూవీ లో వన్ వన్ నెంబరు వనసాగు కోసం ఏకంగా 10 డ్రస్సులు సూపర్ స్టార్ కృష్ణ కోసం వెచ్చించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా ఒక్క సినిమాలోని నటీనటులు కనిపించే సన్నివేశాలను బట్టి రకరకాల దుస్తులు వేసుకుంటారు.
ఇక మూవీ మొత్తం ఎన్ని వాడతారో మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఈ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కాస్ట్యూమ్స్ వాడతారు కాబట్టి సినిమా పూర్తయిన తర్వాత వారు వాడిన దుస్తులను ఇతర వస్తువులను ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక్కోసారి కోట్లాది రూపాయలు పెట్టి దుస్తులు తీసుకొస్తారట. సినిమా పూర్తయిన తర్వాత ఆ దుస్తులను మళ్లీ వెనక్కి పంపించి కొత్త పద్ధతుల్లో డిజైన్ చేసి కుడతారట. ఇక ఇదే తరహా సినిమాలకు అవసరం ఉంటే వాళ్లకి ఇస్తారు. దానికి మరింత డిజైన్స్ యాడ్ చేసి వాడతారట. ఈ విధంగా ఆడియన్స్ గుర్తుపట్టకుండా వివిధ రకాలుగా మారుస్తారని తెలుస్తోంది.
Advertisement