ఈ భూమిపై అత్యంత కష్టజీవి ఏదైనా ఉందంటే తేనేటీగ, చీమలు అని చెప్పవచ్చు. మన చర్యల అవి చనిపోతున్నాయి. దాని ఫలితంగా పర్యావరణం చాలా దెబ్బతింటోంది. అలాగ అని చీమలను మనం ఇంట్లోకి రానివ్వం అవి వస్తే గడపలు, గోడలు ఇలా ఇంట్లో ప్రతి చోటా కన్నాలు పెట్టి పెద్ద కాలనీలే నిర్మించుకుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే ఇంటి పునాది దెబ్బ తింటుంది. దీని ఫలితంగా వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు సంభవించినప్పుడు ఇల్లు కూలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. తాజ్ మహల్ వంటి పెద్ద కట్టడానికి కూడా చీమలు పునాదిలో కన్నాలు పెట్టాయి. ముఖ్యంగా చీమలు మనకు ఇంట్లో కనిపిస్తే వాటిని త్వరగా బయటికి పంపించే పని ప్రారంభించాలి. చీమల్లో నల్ల చీమలు, ఎర్ర చీమలుంటాయి. వీటిలో ముఖ్యంగా ఎర్ర, నల్ల చీమలు ఇంట్లో తిరిగితే ఎలాంటి సమస్యలుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఎర్ర చీమలు ఇంట్లో పెరుగుతున్నాయనుకుంటే ఎక్కువ శాతం అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఎర్ర చీమలు తిరిగే వారి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది. ఎర్ర చీమలు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇంట్లో చెత్త, చెదారం పెరిగితే వాస్తు దోషం పెరగడంతో పాటు ఎర్ర చీమలు కూడా పెరుగుతాయి. ప్రకృతి మనకు చెబుతుందనడానికి సంకేతం.రాళ్ల ఉప్పుతో ఇల్లు తూడ్చాలి. నిమ్మకాయ తొక్కలు తీసి పెడితే అవి మన ఇంటికి రావు. ఎర్ర చీమలు రాకుండా ఉంటాయి.
Advertisement
మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు అయి ఉండాలంటే ఇల్లును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లోకి ఎర్రచీమలు వచ్చినట్టయితే రాళ్ల ఉప్పు, నిమ్మకాయ తొక్కలు మనం అక్కడ వేస్తే అవి వెళ్లిపోతాయి. వాటికి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఉంటుంది. అదేవిధంగా నల్లచీమలను చూడగానే షుగర్ పెడుతుంటారు. ఎందుకంటే అవి ధనాన్ని తీసుకొస్తాయని.. నల్లచీమలు పైకి ఎక్కుతున్నట్టయితే మనకు సక్సెస్ ఉన్నట్టు లెక్క. ఎర్ర చీమలు వద్దనుకుంటున్నామో అవి కావాలని కోరుకోవద్దు. నల్ల చీమలు ఇంట్లోకి ఎలా వస్తున్నాయో గమనించండి. నల్ల చీమలు పైకి వస్తే కుటుంబ సభ్యుల్లో సక్సెస్ ఉంటుంది. కానీ నల్ల చీమలు కిందికి వస్తే మాత్రం సక్సెస్ ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి.
Also Read :
చికెన్‌తో పాటు ఏయే ఆహారపదార్థాలను తీసుకోకూడదో మీకు తెలుసా..?