ప్రముఖ నటి ప్రియమణి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీకి 2003లో ‘ఎవరే అతగాడు’ అనే మూవీతో పరిచయమైంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత తమిళంవైపు కొన్నాళ్ల పాటు దృష్టి సారించి మళ్లీ జగపతిబాబుతో ‘పెళ్ళైనకొత్తలో..’ సినిమాలో నటించింది. ఈ సినిమాతో ప్రియమణి క్రేజ్ పెరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు సినిమాలకు అవకాశాలు వచ్చాయి.
Advertisement
రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ద్రోణా, మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా సినిమాల్లో నటించింది. పలువురు హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది. తాజాగా నాగచైతన్య ‘కస్టడీ’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుందట. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన మనసులోని కోరికను తెలిపింది. స్టార్ హీరో చిరంజీవితో నటించాలని ఉందని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. మెగా మూవీ ఆఫర్ కోసం ప్రియమణి తన ప్రయత్నాలు ప్రారంభించిందని కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
ఆ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. “నాగచైతన్య నాకు చాలా సంవత్సరాల కిందటే పరిచయం. మొదటిసారి తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నా. మా కాంబోలో వచ్చే సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరితో కూడా నేను వర్క్ చేశాను. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరి సినిమాల్లోనూ నటించాను. కానీ మెగాస్టార్ చిరంజీవి గారితో జోడి కట్టే అవకాశం రాలేదన్నారు. ఆయనతో కలిసి నటించాలనుందంటూ తన మనసులో ఉన్నటువంటి కోరికను బయట పెట్టింది. బాలీవుడ్ లో తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని వెల్లడించింది. ముఖ్యంగా ఆ ఇద్దరు హీరోలతో కలిసి ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటిస్తానని చెప్పింది. ఈ ముద్దుగుమ్మకు చిరు, షారుఖ్ తో కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో వేచి చూద్దాం.
Also Read : Sai pallavi marriage:పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి.. వరుడు ఆయనేనా..?