Home » స‌మంత ఆరోగ్యంపై నాగ‌చైత‌న్య ఏమంటున్నారో తెలుసా ?

స‌మంత ఆరోగ్యంపై నాగ‌చైత‌న్య ఏమంటున్నారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘మయోసైటీస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. త్వరలోనే ఈ వ్యాధి నుంచి కోలుకుంటాన‌నే నమ్మకం నాకు ఉంద‌ని స‌మంత‌ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సోష‌ల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా కనిపించే సామ్‌ఈ విషయాన్ని బయట పెట్టడం, కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుందని ఎమోషనల్ గా పోస్ట్ చేయడంతో అభిమానుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఆశ్చ‌ర్యానికి గురయ్యారు.

Also Read : సినిమాల్లోకి అల్లు అర్జున్ సతీమణి…ఆ స్టార్ హీరో సినిమాలో బంపరాఫర్…?

Advertisement

Manam

సినీ న‌టులు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, అఖిల్, కృతిస‌న‌న్‌, రాశిఖన్నా, జెనీలియా హన్సిక నందిని రెడ్డి, వంశీ పైడిపల్లి సహా సమంతతో కలిసి పని చేసిన చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలంటూ స్పందించారు. కొంద‌రూ అభిమానులు కూడా స‌మంత త్వరగా కోలుకోవాలంటే పోస్టులు చేస్తున్నారు. సమంత మాజీ భర్త నాగచైతన్య సోదరుడు అఖిల్ కూడా సమంత ఆరోగ్యంపై స్పందించాడు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మరో టాపిక్ వైరల్ అవుతోంది. నాగచైతన్య, సమంత ఆరోగ్యం పై స్పందిస్తాడా..? లేదా..? అనే టాపిక్ న‌డుస్తోంది.

Advertisement

Also Read : ర‌జినీ నుండి ధ‌నుష్ వ‌ర‌కు…ఒక్కో సినిమాకు త‌మిళ స్టార్స్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

Manam

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ ఇద్దరు ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి.. ఆ స్నేహం ఆ త‌రువాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. 2018లో వివాహ బంధం తో ఒకటైన ఈ జంట, గత ఏడాది అక్టోబర్ లో కో అండర్ స్టాండింగ్ తో విడిపోయినట్టు ప్ర‌క‌టించారు. ప్రేమ పెళ్లి కంటే ముందు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. చై, స్యామ్ ను స్నేహితురాలిగా భావించి ఆమె ఆరోగ్యం పై స్పందించాలంటూ నెటిజెన్లు, అభిమానులు కోరుకుంటున్నారు. మరి నాగ‌చైత‌న్య స్పందిస్తాడో లేదా అనేది చూడాలి. మ‌రోవైపు ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య స‌మంత‌ని ర‌హ‌స్యంగా క‌లిసిన‌ట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. అధికారికంగా మాత్రం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం విశేషం.

Also Read : ఇతర భాషల్లో అత్యధిక సార్లు రీమేక్ చేసిన టాలీవుడ్ 10 సినిమాలు ఏవంటే ?

 

Visitors Are Also Reading