Home » సినిమాల్లోకి అల్లు అర్జున్ సతీమణి…ఆ స్టార్ హీరో సినిమాలో బంపరాఫర్…?

సినిమాల్లోకి అల్లు అర్జున్ సతీమణి…ఆ స్టార్ హీరో సినిమాలో బంపరాఫర్…?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ ల కుటుంబ సభ్యులు కూడా సెలబ్రిటీ ల రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటారు. హీరోల కూతుళ్లు, కొడుకులు, భార్యలు ఇలా ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సందడి చేసే సెలబ్రిటీల కుటుంబ సభ్యులు లక్షల్లో ఫాలోవర్లను సైతం సంపాదించుకుంటారు.

Advertisement

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ స్టార్ హీరో భార్య సినిమాలో ఛాన్స్ ద క్కించుకుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు… అల్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…. రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం పుష్ప పార్ట్ -2 షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

స్నేహ రెడ్డి హీరోయిన్ రేంజ్ లో ఫోటోషూట్ లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు స్నేహ రెడ్డికి ఓ మలయాళ సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading