Home » రెండో పెళ్లి గురించి మనోజ్ ఏమన్నాడో తెలుసా ?

రెండో పెళ్లి గురించి మనోజ్ ఏమన్నాడో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2004లో దొంగ దొంగది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా బిందాస్ చిత్రంతో నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. రాజుభాయ్, వేదం, ఝుమ్మందినాదం, కరెంట్ తీగ వంటి సినిమాలతో మెప్పించాడు. అదేవిధంగా కొన్ని ఫ్లాప్స్ సినిమాల్లో నటించాడు మనోజ్. ఆరేళ్ల తరువాత మనోజ్ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 

Advertisement

ఈ నేపథ్యంలోనే   టాలీవుడ్ హీరో మంచు మనోజ్  త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మార్చి మొదటి వారంలో భూమా మౌనికను పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే  పెళ్లికి సంబంధించి  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందిస్తూ.. తామిద్దరం మంచి స్నేహితులమని, తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపాడట.

Advertisement

Manam News

కష్ట సమయాల్లో మౌనిక తనకు అండగా నిలబడిందని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఉండటం అదృష్టమని పేర్కొన్నట్లు తెలుస్తోంది.  మనోజ్, మౌనిక జంటగా చాలాసార్లు కనిపించడంతో ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. పైగా త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ ఆ మధ్య హింట్ కూడా ఇచ్చాడు హీరో. దీంతో వీరి పెళ్లి జరగడం ఖాయమని అంతా ఫిక్సయ్యారు. కానీ ఇప్పటివరకు వీరి వివాహం గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇక పోతే మనోజ్ కు ఇదివరకే ప్రణతితో వివాహం జరగగా మనస్పార్థాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటు మౌనికకు కూడా ఇదివరకే పెళ్లవగా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు.

Also Read :  ఇకపై నన్ను ఏదీ బాధించలేదు… సమంత ఎమోషనల్ పోస్ట్

Visitors Are Also Reading