Home » మంచు మనోజ్ భార్య మౌనికకి ఇలాంటి మాట ఇచ్చారా ? హాట్స్ ఆఫ్ అంటున్న నెటిజన్స్ !

మంచు మనోజ్ భార్య మౌనికకి ఇలాంటి మాట ఇచ్చారా ? హాట్స్ ఆఫ్ అంటున్న నెటిజన్స్ !

by Anji
Ad

మంచు మనోజ్, ప్రణతిరెడ్డిల వివాహం 2015లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని మనస్పార్థాల కారణంగా ఈ జంట 2019లో విడిపోయారు. ఇక ఆ తరువాత మనోజ్ రెండో పెళ్లిపై పలు రూమర్లు విని పించాయి. వాటిపై మనోజ్ మాత్రం స్పందించలేదు.. ఖండించలేదు. గత ఏడాది వినాయక చవితి ఉత్సవాల్లో మనోజ్, భూమా మౌనిక రెడ్డితో కలిసి సందడి చేసిన విషయం విధితమే. దీంతో మనోజ్, భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ.. ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. మార్చి 03, 2023 శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మనోజ్, భూమా మౌనికరెడ్డిల పెళ్లి జరిగింది.  

Also Read :  Manchu Manoj : మోహన్ బాబు సమక్షంలో మంచు మనోజ్ పెళ్లి..ఇదిగో ఫోటోలు

Advertisement

Manoj Marriage

Manoj – Marriage

ఫిల్మ్ నగర్ లో ఉన్నటువంటి మంచు లక్ష్మీప్రసన్న నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేడుక ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు దర్శకుడు బాబీ, వెన్నెల కిషోర్, సింగర్ సునిత దంపతులు, నరేష్, పవిత్ర దంపతులు, శివ బాలాజీ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు  హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. మనోజ్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఈ పెళ్లి మనోజ్ , భూమా మౌనికారెడ్డి ఇద్దరికీ రెండోదే. 2016లో భూమా మౌనికా రెడ్డికి ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2018లో ధైరవ్ రెడ్డి అనే కొడుకు జన్మించాడు. ఆ తరువాత మనస్పార్థాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. దీంతో కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నారు మౌనికరెడ్డి.  

Advertisement

Also Read :   Jr:NTR జాతకంలో అలా ఉందా..జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన భూమా మౌనికారెడ్డి కుటుంబంతో మంచు కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు తీసుకొచ్చింది. అయితే పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే మంచు మనోజ్ మౌనికరెడ్డికి ఓ మాట ఇచ్చారట. ఈ పెళ్లితో మనోజ్ మౌనికకి భర్త మాత్రమే కాదు.. ధైరవ్ రెడ్డికి తండ్రి కూడా అవుతాడు అంటూ మాట ఇచ్చారట. కన్ను కొడుకులా చూసుకుంటానని మౌనికారెడ్డికి పెళ్లికి ముందే మనోజ్ మాట ఇచ్చారట. పెళ్లి అయిన తరువాత కూడా బాబు మనతోనే ఉంటాడని.. సొంత బిడ్డ మాదిరిగానే చూసుకుంటానని చెప్పారట. ఈ నిర్ణయంతో మంచు మనోజ్ కి ఎంత స్వచ్ఛమైన ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read :  తండ్రిని దూరం చేసుకున్న హీరో సూర్య.. దీనికి కారణం జ్యోతిక నేనట?

Visitors Are Also Reading