టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన నటుడు ఉదయ్ కిరణ్. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అమ్మాయిల రాజకుమారుడిగా వెలుగొందిన ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీలో వెలుగు వెలిగాడు. అంతే తక్కువ కాలంలో తన కెరీర్ పతనం అయింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొంది చివరికీ సూసైడ్ చేసుకునే పరిస్థితి చేరుకుంది. ఆయన చనిపోయి చాలా కాలం అయినా ఆయనకు సంబంధించిన విషయాలు తరుచూ ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆయన మరణించే ముందు రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ఆ లేఖలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : Telugu Anchors Remuneration list: ఈ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా..?
Advertisement
Advertisement
తన భార్యను ఉద్దేశించి ఇందుల పలు కామెంట్లు చేశాడు. విశిత నీతో ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నా.. చివరగా నీకు ఈ లేఖ రాయాలనిపించింది. సినిమాల పిచ్చితో నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇండస్ట్రీ నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అందరూ నన్ను దూరం పెడుతున్నారంటూ బాధ పడ్డారు. భర్తగా నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ప్రొడ్యూసర్లు చాలా మంది నాకు హ్యాండ్ ఇచ్చారు. ఈ రోజు ఫోన్ చేస్తానన్న ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేయలేదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినే పరిస్థితిలో లేవు.
వాడు పచ్చిమోసగాడు. వాడినినమ్మకూడదని చెప్పాడు. అయితే ఎవర్నీ నమ్మకూడదలో మాత్రం ఇందులో క్లియర్‌గా లేదు. నువ్వు తెలుసుకునే రోజు తొందరగానే వస్తుంది. కానీ ఆరోజు నేను నీ పక్కన ఉండను. అందరూ నావల్లే బాధపడుతున్నావని ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పటి నుంచి ఆ బాధ ఎవ్వరికి ఉండదు. కానీ ఒక్కమాట నీ దగ్గర ఉన్న నగలు, మా అక్కకు ఇవ్వు అని చెప్పాడు. అంతేకాదు నువ్వు అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో అని కూడా చెప్పాడు. ఈ రోజుతో నాకు ఎక్స్‌పెయిర్ తేదీ అయిపోయింది అని ఆ లేఖలో రాశాడు.
Also Read : చైతూతో మళ్లీ కలిసే అవకాశం లేకుండా చేసిన సమంత..!