Home » పంచ్ ప్ర‌సాద్ భార్య గురించి హైప‌ర్ ఆది ఏమ‌న్నారో తెలుసా..?

పంచ్ ప్ర‌సాద్ భార్య గురించి హైప‌ర్ ఆది ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

హైప‌ర్ ఆది గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అత‌ను బ‌జ‌ర్ద‌స్త్ షో ద్వారా ఎంత ఫేమ‌స్ అయ్యాడో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా హైప‌ర్ ఆది ఎప్పుడూ న‌వ్విస్తూనే ఉంటాడు. ఆయ‌న పంచ్ లు కూడా అలాగే ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ఆది త‌న గుండె లోతుల్లోంచి కొన్ని మాట‌లు అంటుంటాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి షోల‌లో చెప్పే స‌మ‌యంలో అనే మాట‌లు, ఎమోష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. త‌న త‌ల్లిదండ్రుల గురించి త‌న స్ట్ర‌గుల్స్ గురించి చెప్పి ఎన్నో సార్లు అంద‌రినీ ఏడిపించాడు. తాజాగా పంచ్ ప్ర‌సాద్ భార్య గురించి చాలా గొప్ప‌గా చెప్పాడు ఆది.

Advertisement

 

పంచ్ ప్ర‌సాద్ ను అత‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమ అంటే కేవలం క‌లిసి తిరిగి ఎంజాయ్ చేసేట‌టువంటి ప్రేమ కాదు.. జీవితాంతం త‌న భ‌ర్త కోసం నిల‌బ‌డే ప్రేమ అది. ఏ భార్య చేయ‌ని త్యాగం చేసే ప్రేమ అది. పంచ్ ప్ర‌సాద్ చావు బ‌తుకుల్లో ఉన్నా కూడా వ‌ద‌ల‌ని ప్రేమ అది. పెళ్లికి ముందే పంచ్ ప్ర‌సాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. చావు బ‌తుకుల్లో ప్ర‌సాద్ ఉన్నాడు. అలాంటి వాడిని పెళ్లి ఏం చేసుకుంటావ్ అని అంద‌రూ వేలెత్తి చూపారు. ముఖ్యంగా పంచ్ ప్ర‌సాద్ భార్య త‌ల్లిదండ్రులు కూడా పెళ్లి వ‌ద్ద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ తాను ప్రేమించిన వ్య‌క్తిని మాత్రం వ‌దిలిపెట్ట‌లేదు. కాపాడుకుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Samantha : స‌మంత త‌న సంపాద‌న‌లో ఎక్కువ‌గా ఖ‌ర్చు ఎందుకు చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ఒక కిడ్నీ ఇచ్చేందుకు కూడా ముందుకు వ‌చ్చిది. అలా త‌న భ‌ర్త కోసం అంద‌రినీ ఎదురించింది పంచ్ ప్ర‌సాద్ భార్య‌. తాజాగా వీరి జ‌ర్నీని ఓ ప‌ర్ఫామెన్స్‌లో చూపించారు. శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో నెంబ‌ర్ వ‌న్ జోడి అనే కాన్సెప్ట్ తో వ‌చ్చే ఆదివారం ఈ షో ను ర‌న్ చేస్తున్నారు. ఇందులో పంచ్ ప్ర‌సాద్ ల‌వ్ స్టోరీని ప‌ర్ఫామెన్స్ చేసి చూపించారు. ఇక అది చూసి ప్ర‌సాద్ భార్య ఎమోస‌న‌ల్ అయింది. ప్రేమ కోసం ఎంతో ఖ‌ర్చు పెట్టిన వారిని చూశాం. కానీ ప్రేమ కోసం త‌న జీవితాన్ని ఖ‌ర్చు పెట్టిందంటూ ఆమె మీద ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు హైప‌ర్ ఆది.

ఇది కూడా చ‌ద‌వండి :  చంద్ర‌బోస్ త‌న‌కంటే ఆరేళ్లు సీనియ‌ర్ అయినా సుచిత్ర‌నే ఎందుకు పెళ్లిచేసుకున్నారో తెలుసా..?

Visitors Are Also Reading