Telugu News » Blog » Samantha : స‌మంత త‌న సంపాద‌న‌లో ఎక్కువ‌గా ఖ‌ర్చు ఎందుకు చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Samantha : స‌మంత త‌న సంపాద‌న‌లో ఎక్కువ‌గా ఖ‌ర్చు ఎందుకు చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Anji
Ads

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం స‌మంత టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నార‌నడంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ముఖ్యంగా స‌మంత‌, నాగ‌చైత‌న్య దంప‌తులు విడిపోయిన త‌రువాత స‌మంత వ‌రస సినిమాల‌తో బిజి బిజీగా గ‌డుపుతోంది. అందులో లేడీ ఓరియేంటెడ్ సినిమాలు కూడా బాగానే చేస్తుంది. ముఖ్యంగా స‌మంత‌ అతి త‌క్కువ కాలంలో హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ద‌క్కించుకొని టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది.

Ads


సినిమాల‌తో మంచి ఫామ్ లో ఉన్న స‌మ‌యంలోనే అక్కినేని నాగచైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాదాపు వీరు ఎనిమిదేళ్ల పాటు ప్రేమ‌లో మునిగితేలారు. ఇక వీరు 2017 అక్టోబ‌ర్ నెల‌లో పెళ్లి చేసుకున్నారు. 2021 అక్టోబ‌ర్‌లోనే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. విడాకుల ప్ర‌క‌టించిన త‌రువాత ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. స‌మంత ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో న‌టిస్తుంది. ఓ హాలీవుడ్ మూవీలో కూడా న‌టిస్తుంది స‌మంత‌. తెలుగులో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం, హ‌రి హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వంలో య‌శ‌ద సినిమాల‌ను చేస్తోంది. ఇదిలా ఉండ‌గా స‌మంత‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Ads

ఇది కూడా చ‌ద‌వండి :  కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్లను చూశారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?


టాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకునే హీరోయిన్ లిస్ట్‌లో స‌మంత మొద‌టి స్థానంలో ఉన్నారు. స‌మంత డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌డానికి సంబంధించి షాకింగ్ విష‌యాలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. స‌మంత తాను సంపాదించిన డ‌బ్బుల్లో చాలా వ‌ర‌కు విరాళాల రూపంలో ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. స‌మంత సేవ కార్య‌క్ర‌మాల గురించి చాలా మందికీ తెలిసే ఉంటుంది. ప్ర‌త్యూష ఫౌండేష‌న్ ద్వారా త‌న వంతుగా సేవా చేస్తుంటుంది. ఒక్కో సినిమాకి రూ.3కోట్ల వ‌ర‌కు స‌మంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. చాలా వ‌ర‌కు సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తున్నార‌ని స‌మాచారం.

Ad

 ఇది కూడా చ‌ద‌వండి :  అల్లు అర్జున్ త‌న కెరీర్ ప్రారంభంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో న‌టించాడ‌నే విష‌యం మీకు తెలుసా..?