ఉదయం అందరికీ ఏదో ఒకటి తినడం అలవాటు ఉంటుంది. నిద్రలేవగానే చాలా మంది కాలకృత్యాలు తీర్చుకుని తినడానికి ముందు బ్రష్ చేసుకుని తింటారు. కొందరూ మాత్రం నిద్ర లేవగానే బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. అదేవిధంగా బ్రేక్ ఫాస్ట్ కూడా చేస్తుంటారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేస్తే రోజు అంతా యాక్టివ్ గా ఉంటాం. ప్రస్తుతం ఎక్కువశాతం బద్దకం పెరిగిపోయి బ్రష్ చేయకుండానే బ్రేక్ ఫాస్ట్ చేసేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా తీవ్రమైన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నోటి దుర్వాసన సమస్య వచ్చే అవకాశం ఉందట.దీనిని హలిటోసిస్ అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోందట.
నోటి శుభ్రత లేకపోవడం వల్ల ఇది వస్తుంది. రోజూ మనం తినే ఆహారాలు నోట్లో ఎంతో కొంత భాగం ఉంటాయి. అవి ఎక్కువ సమయం గడిచే కొద్ది కుళ్లీ పోతాయి. దీంతో నోట్లో బ్యాక్టీరియా తయారు అవుతుంది. దీని ఫలితంగా నోటి దుర్వాసన వస్తుంది. దంతాలను తోముకోకపోతే నోట్లో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది. నోట్లో బ్యాక్టీరియాను అలేగే పెట్టుకొని ఉదయం బెడ్ కాఫీ, టీ లాంటివి తాగడం అస్సలు మంచిది కాదు. కొందరూ ఆహారాన్ని కూడా తింటుంటారు. అది చాలా ప్రమాదమనే చెప్పాలి. అందుకే కచ్చితంగా ఉదయం వేళలో దంతాలను శుభ్రం చేసుకోవాలి.
Advertisement
Also Read : భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగవచ్చా..? నీళ్లను ఎప్పుడు తాగాలంటే..?
Advertisement
నోటి శుభ్రత లేకపోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. దీంతో దంతాలను తీసేయాల్సి వస్తుంది. చిగుళ్ల సమస్యలు వస్తుంటాయి. దంతాలు బలహీనంగా మారుతాయి. కాబట్టి దంతాలను రోజూ తోముకోవాలి. ఉదయం, రాత్రి భోజనం తరువాత తోముకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉదయం టీ లేదా కాఫీ తాగడం వల్ల మీరు రోజంతా పని చేకపోయినా అలిసిపోయినా ఫీలింగ్ కలుగుతుంది. ఉదయాన్నే బ్రష్ చేయకుండా టీ, కాఫీ తాగే వారికి పళ్లలో పిప్పి, పంటి నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. నానబెట్టిన వేరు శనగను అల్పాహారం ముందు తినాలి. వేరు శనగ బరువు తగ్గడం ప్రయోజనాలతో సంబంధం కలిగి ఉంటుంది. వేరు శనగలో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి అతిగా తినకండి.
Also Read : మీకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే గుండెలో రంద్రం ఉన్నట్టే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి..!
సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తినడం వల్ల బరువు తగ్గవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా పదార్థం అధికంగా తినడం శరీరానికి హాని కలిగిస్తుంది. వేరు శనగ విషయంలో కూడా ఇదే పరిస్థితి. వేరు శనగ అధికంగా తీసుకుంటే గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. ఇది చాలా మందిలో అలెర్జీని కలిగిస్తుంది. అలెర్జీ ఉన్న వారు వేరు శనగ వాడకూడదు. వేరు శనగ మీ కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ సంబంధిత పిత్తాశయ రాళ్లను నియంత్రించడానికి శనగ పిండి సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తక్కువ గ్లైసిమిక్ సూచిక కలిగిన వేరు శనగ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది.
Also Read : వెల్లుల్లిని పరగడుపున తేనెలో కలుపుకుని తింటే.. బరువుతో పాటు ఈ 4 సమస్యలు మాయం