ఆచార్య చాణక్యుని గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు. నీతిశాస్త్రంలో ఓ మనిషి తన జీవితంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. ఎటువంటి మార్గంలో వెళ్లాలనే ఉంటుంది. భార్య గుణగణాలకు సంబందించి పలు కీలక విషయాలను వెల్లడించారు. భార్య భర్తతో ఎప్పుడు నిజమే మాట్లాడుతూ.. ధర్మాన్ని అనుసరిస్తూ భర్తను గౌరవించి, ప్రేమించి, అతని సుఖ, దుఃఖాల్లో ఎప్పుడు పాలు పంచుకోవడానికి సిద్ధపడగలిగే విధంగా ఉండాలి. అదృష్టం వల్ల ఎవరికైనా ఇలాంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. అలాంటి స్త్రీ భాగస్వామిగా వస్తే భర్త వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ప్రేమను పంచాలి.
భార్య సామాన్యదైన, రూపవతి అయినా, చదువుకున్నదైన, నిరక్షరాస్యులైన, సంస్కారవంతురాలైన కానీ కుటుంబాన్ని చక్కగా నిర్వహించగల సామర్థ్యం ఉన్నదై ఉండాలి. అలాంటి భార్యను భర్త ఎల్లప్పుడూ గౌరవించాలి. అదేవిధంగా ఆమెతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆచార్య చెప్పారు. భార్య స్వరూపం కన్నా ఆమె లక్షణాలు ముఖ్యమైనవని తెలిపారు.
Advertisement
Advertisement
మీ భాగస్వామి ఎంత నమ్మదిగినది అని మీరు తెలుసుకోవాలంటే చాలా నమ్మకమైన పనిని ఆమెకు అప్పగించాలి. ఇలా చేస్తే అది వారి ఉద్దేశాల గురించి తెలియజేస్తుంది. అంతేకాదు మీ వద్ద డబ్బు, కీర్తి లేనప్పుడు కూడా మీ భార్యను పరీక్షించడం ద్వారా ఆమె నిజంగా మీ పట్ల అంకిత భావంతో ఉందో లేదో తెలుస్తుంది. ఇలాంటి స్త్రీ మీకు భార్యగా లభిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా మీ జీవితం సుఖంగా ఉంటుంది.
ఒక స్త్రీ ఇల్లు కట్టుకోగలదు. అదేవిధంగా నాశనం కూడా చేయగలదు అని ఆచార్య చాణక్య నీతిశాస్త్రం ద్వారా తెలిపారు. భార్య చెడు స్వభావం కలది అయితే ఆమెతో ఉండకపోవడమే మంచిది. అలాంటి భార్య మొత్తం కుటుంబాన్ని నాశనం చేయగలరు. అలాంటి వారితో ఉంటే ఇంట్లో ఎప్పుడూ సంతోషం, శాంతి, ఉండదు.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది