Home » గాడ్‌ఫాద‌ర్ సినిమా గురించి చిరంజీవి ఏమ‌న్నారో తెలుసా..?

గాడ్‌ఫాద‌ర్ సినిమా గురించి చిరంజీవి ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌చ్చిన సినిమాల‌న్నికెల్లా సూప‌ర్ హిట్ గా నిలిచిన సినిమా ఏదైనా ఉందంటే అది గాడ్‌ఫాద‌ర్ అనే చెప్పుకోవాలి. ఖైదీ 150, సైరా న‌ర్సింహారెడ్డి విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ గాడ్‌ఫాద‌ర్ సూప‌ర్ హిట్ అనే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఈ సినిమా హిందీలో ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తోంది. హిందీలో దాదాపు కొత్త‌గా 600 థియేట‌ర్ల‌ను పెంచ‌డం విశేషం. తాజాగా గాడ్‌ఫాద‌ర్ స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు.


ఈ స‌క్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. “నా జీవితంలో అద్భుత‌మైన 15 సినిమాల్లో గాడ్‌ఫాద‌ర్ ఒక‌టి. ఇంద్ర‌, ఠాగూర్ త‌రువాత ఆ స్థాయి విజ‌యం అటుంటే ఆనందంగా ఉంది. ఈరోజుల్లో కంటెంట్ బాగుంటేనే సినిమాకి వ‌స్తార‌ని నేనే చెప్పాను. ఈ సినిమాతో ఆ న‌మ్మ‌కం నిజం అయింది. పారితోషికం కోసం ఎవ్వ‌రం ప‌ని చేయ‌లేదు. విజ‌యం ఇవ్వాల‌ని ప‌ని చేశాం. మేం సినిమాపై న‌మ్మ‌కంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌చారం గురించి ప‌లు ర‌కాలుగా మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. మేం ఏం చేయాలో కూడా మీడియానే నిర్దేశిస్తుంటే అది చికాకుగా ఉంటుంది అని పేర్కొన్నారు.

Advertisement

Advertisement

Also Read :  ఈ 7 గురు సెల‌బ్రెటీ జంట‌ల్లో భ‌ర్త‌ల కంటే భార్య‌లే వ‌యసులో పెద్ద‌వారు..ఏజ్ గ్యాప్ ఎంతంటే.?


ముఖ్యంగా గాడ్‌ఫాద‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వ‌ర్షం ప‌డిన‌ప్ప‌టికీ త‌న స్పీచ్ కొన‌సాగించాన‌ని, ఆపితే మీడియా వాళ్లు ఎక్క‌డ కంపు చేస్తారేమోన‌నే భ‌యంతో ఆ కార్య‌క్ర‌మానికి బ్రేక్ రాకుండా చూసుకున్న‌ట్టు తెలిపారు చిరంజీవి. దాదాపుగా అన్నీ డ‌బ్బుతోనే ముడిప‌డి ఉండ‌వ‌ని స‌ల్మాన్‌ఖాన్‌కి పారితోషికం ఇవ్వ‌డానికి వెళ్లితే తిర‌స్క‌రించార‌ని చెప్పారు చిరంజీవి. సల్మాన్‌ఖాన్ మంచి మ‌నసున్న వ్య‌క్తి అని, స‌ల్లూబాయ్ చాలా స‌ర‌దాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.

Also Read :  నాలుగు నెల‌ల గ‌ర్భిణి డ్యాన్స్‌.. పోటోలు వైర‌ల్

Visitors Are Also Reading