Home » దిల్ రాజు గురించి బీవీఎస్ రవి ఏమన్నారో తెలుసా ? 

దిల్ రాజు గురించి బీవీఎస్ రవి ఏమన్నారో తెలుసా ? 

by Anji
Ad

దర్శకుడు బీవీఎస్ రవి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన శివయ్య, సీతారామరాజు, ప్రేయసిరావే, స్నేహితులు, అయోధ్యరామయ్య, భద్రాచలం వంటి సినిమాలకు పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఆ తరువాత పలు స్టార్ హీరో సినిమాలకు రైటర్ గా పని చేశారు. రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న బీవీఎస్ రవి దర్శకునిగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనే చెప్పాలి. గోపిచంద్ హీరోగా నటించిన వాంటెడ్ చిత్రంతో దర్శకుడిగా మారారు. మరోవైపు లో బడ్జెట్ తో విజువల్, టెక్నికల్ గా తెరకెక్కిన సెకండ్ హ్యాండ్ చిత్రంతో నిర్మాతగా మారారు. సాయిధరమ్ తేజ్ తో జవాన్ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ఆశించిన మేరకు ఆకట్టుకోలేదనే చెప్పాలి. 

Advertisement

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు కారణంగా జవాన్ చిత్రం డిజాస్టర్ గా నిలిచిందని  చెప్పుకొచ్చారు. దిల్ రాజు ఈ సినిమాని గెలికాడని, కలగూర గంపలాగా చేసాడని.. దీంతో ఈ సినిమా రూపు రేఖలు మొత్తం మారిపోయాయని వెల్లడించారు. దిల్ రాజుకి ఫ్యామిలీ సబ్జెక్ట్ పై మంచి పట్టు ఉంది. కానీ థ్రిల్లర్స్, యాక్షన్, హర్రర్ వంటి సినిమాలపై అంతగా పట్టులేదని చెప్పారు. జవాన్ ఫస్ట్ కట్ సమయంలోనే చూశాడని.. అది చూసి సినిమా మొత్తం మార్చేశారని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి దానిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు.   

Advertisement

Also Read :  నరేష్ పవిత్ర పెళ్లికి అంతా క్లియర్..10కోట్లతో ఆమెను సెట్ చేశారా..?

Manam News

అంతా చేసి చూడవయ్యా అంతా కరెక్ట్ చేసి పెట్టాను.. ఫస్టాప్ యావరేజ్ గా ఉంటుంది. సెకండాఫ్ బాగుంటుందన్నారు. కానీ అందరూ ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది.. సెకండాఫ్ బాలేదంటున్నారని.. క్లైమాక్స్ పోయిందంటున్నారనని చెప్పా. కానీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందనే విషయాన్ని బీవీఎస్ రవి వెల్లడించారు. దిల్ రాజు తనకు ఇష్టమైన వ్యక్తి అని.. దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. జవాన్ చిత్రాన్ని గెలికాడనే విషయాన్ని ఆయన స్పష్టం చేసారు. జవాన్ ఫ్లాప్ కి దృవ కూడా ఓ కారణంగా చెప్పుకొచ్చారు. తమ సినిమా కథ, దగ్గరగా ఉన్నాయని తెలిపారు. తమిళంలో తని ఒరువన్ ట్రైలర్ రాకముందే మా చిత్రం యొక్క కథను సాయి ధరమ్ తేజకి చెప్పానని.. అదే సమయంలో దృవ రీమేక్ చేయడం మాకు కాస్త దెబ్బ పడిందని వెల్లడించారు. సాయి ధరమ్ తేజ హీరోగా నటించిన ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గానటించింది. స్నేహ భర్త ప్రసన్న విలన్ గా నటించారు. దిల్ రాజు పర్యవేక్షణలో కృష్ణ ఈ సినిమాను నిర్మించారు. గత ఏడాది  విక్రమ్ కుమార్ తెరకెక్కించిన థాంక్యూ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు.

Also Read :  టాలీవుడ్ హీరోయిన్ తో కోలీవుడ్ విలన్ ప్రేమాయణం..?

Visitors Are Also Reading