Home » వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ ఏమన్నారో తెలుసా ?

వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ ఏమన్నారో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి బాలకృష్ణ నటించినటువంటి తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం రూ.140కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం సక్సెస్ ని వీరమాస్ బ్లాక్ బస్టర్ పేరుతో సెలబ్రేట్ చేశారు. స్వతహాగా బాలయ్య తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఏపీ ప్రభుత్వం పని తీరుపై ఆయన తనదైన శైలిలో సంబురపడుతున్నారు. వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని డైలాగ్ లు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించేవిధంగా ఉన్నదనే వివాదం చెలరేగింది. దీనిపై ఏపీ మినిస్టర్ రోజాతో సహా కొంత మంది బాలయ్యపై ప్రతి విమర్శలు కూడా చేసారు. ఆ గొడవ సద్దుమణుగుతుందనుకుంటున్న సమయంలోనే మళ్లీ బాలయ్య ఏపీ ప్రభుత్వంపై వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో చురకలు వేశారు. 

Advertisement

ఈ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని బాలకృష్ణకి వీరాభిమాని. సమరసింహారెడ్డి సినిమా విడుదల సమయంలో లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తిని అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు గోపిచంద్ మలినేని పేర్కొన్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. “గోపిచంద్ మలినేని నాకు వీరాభిమాని. అప్పట్లో గోపిచంద్ సమరసింహారెడ్డి సినిమాల సమయంలో దెబ్బలు కూడా తిన్నారు. నేను మాత్రం కారణం చెప్పను. ఎందుకు అంటే ఇప్పుడు మళ్లీ కేసు బుక్ చేస్తారు. ఇప్పుడు చాలా తేలిక కదా.. కేసులను బుక్ చేయడం నిరపరాధుల మీద” అని పేర్కొన్నారు.  బాలయ్య ఈ వేడుకలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 

Advertisement

Also Read :  సమంత 10వ తరగతి మార్కులను మీరు చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

veerasimhareddy-reviewదర్శకుడు గోపిచంద్ మలినేనిని బేస్ చేసుకొని బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మళ్లీ ఏపీ ప్రభుత్వంపై బాలయ్య చురకలు అంటించారని నెటిజన్లు పేర్కొంటున్నారు. వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడదల అయింది. రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాలయ్య సినీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా వీరసింహారెడ్డి నిలిచింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్ సినిమాను నిర్మించారు. వీరమాస్ బ్లాక్ బస్టర్ అంటూ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

Also Read :  లెజెండ్ నుంచి వీరసింహారెడ్డి వరకు బాలయ్య నటించిన 10 సినిమాల కలెక్షన్లు ఇవే..!

Visitors Are Also Reading