Home » చంద్రమోహన్ భార్య పెళ్లి కాకముందే చాలా ఫేమస్….చిరంజీవికి రిలేషన్ !

చంద్రమోహన్ భార్య పెళ్లి కాకముందే చాలా ఫేమస్….చిరంజీవికి రిలేషన్ !

by Bunty
Ad

దిగ్గజ నటుడు చంద్రమోహన్ ఇటీవలే కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈయన మరణం సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో పడేసింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. చంద్రమోహన్ వ్యక్తిగత విషయానికి వస్తే… అతనికి జలంధర అనే అమ్మాయితో వివాహం జరిగింది. చంద్రమోహన్ భార్య నవల రచయితగా అతి చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈవిడ వివాహానికి ముందే ఎన్నో మంచి కథలను రాశారు. ఈవిడ మొదటగా ఆంధ్రభూమికి ‘నా కథ’ అనే స్టోరీని రాశారు. ఈ కథ ద్వారా జలంధరకు మంచి పేరు వచ్చింది.

Do You Know This About Chandra Mohan's Family

Do You Know This About Chandra Mohan’s Family

ఇక వివాహ అనంతరం జలంధర కథలను అలానే రాసుకుంటూ వచ్చారు. ఎన్నో నవలలు రాశారు. ఆంధ్రభూమిలో కూడా కొన్ని వందల కథలను రాశారు. ఆవిడ రచయిత్రిగా సమాజంలో మార్పు కోసం ఎన్నో కథలను రాశారు. తన కథలలో ఒక్క చెడు పాత్ర కూడా లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇక తనకి సినిమా కథలు రాయమని అవకాశం వచ్చినప్పటికీ ఆవిడ రాయలేదు. చంద్రమోహన్ ఖాళీ సమయంలో తన భార్య రాసిన కథలను చదివి నచ్చితే బాగుందని లేకపోతే లేదని నిర్మొహమాటంగా చెప్పి తన భార్యను ప్రోత్సహించేవారట. ఇక చంద్రమోహన్ షూటింగ్ సమయంలో తన భార్యను తనతోపాటు రమ్మని అనేవాడట. కానీ జలంధర వెళ్ళేదికాదట. కానీ కొన్ని ప్రత్యేక వేడుకల సమయంలో జలంధర వెళ్లేదట.

Advertisement

Advertisement

అక్కడ ఓ సమయంలో చిరంజీవి భార్య సురేఖతో మంచి స్నేహం ఏర్పడిందట. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారట. సురేఖ, జలంధర ఎప్పుడూ కలుసుకుంటూ ఉండేవారు. ఇక చంద్రమోహన్ కి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు అమెరికాలో సైకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. చిన్న కూతురు చెన్నైలో ఉంటుంది. ఇక చంద్రమోహన్ సినిమాలో నటిస్తున్న సమయంలో చాలా భూములను కొని పెట్టుకున్నారట. ఆయన ఆస్తులకు సంబంధించి వార్తలు వచ్చినప్పుడు చంద్రమోహన్ భూములు ఉన్నాయని ఒప్పుకున్నాడు కానీ వాటి విలువ ఎంత అని అడిగినా కూడా చెప్పలేదట. దాదాపు చంద్రమోహన్ ఆస్తి విలువ 200 కోట్ల వరకు ఉంటుందట.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading