Home » తారకరత్న ఫాదర్ మోహనకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?

తారకరత్న ఫాదర్ మోహనకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నందమూరి తారకరత్న గురించి చర్చ జరుగుతోంది. ఆయన సేఫ్ గా బయటకు రావాలని నందమూరి అభిమానులతో పాటు ఎంతోమంది ప్రజలు కోరుకుంటున్నారు.. అలాంటి నందమూరి తారకరత్న తండ్రి మోహన కృష్ణ గురించి కూడా చాలా వార్తలు వస్తున్నాయి.. మరి ఆయన ఎవరు.. ఏం చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం.. అన్న ఎన్టీఆర్ కు మొత్తం 12 మంది సంతానం. ఇందులో ఎనిమిది మంది మగ పిల్లలు. ఇందులో ఐదవ కుమారుడు నందమూరి మోహనకృష్ణ. ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఈయన ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటారు.

Advertisement

ఈయన కూడా సెప్టెంబర్ 2,1956 అన్న హరికృష్ణ పుట్టినరోజునే జన్మించడం విశేషం. ఇక నందమూరి తారకరామారావుకు సీనియర్ రామకృష్ణ, జయ కృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, జూనియర్ రామకృష్ణ, జయశంకర్ కృష్ణ సంతానంగా ఉన్నారు. ఇందులో ఐదవ వ్యక్తి మోహన్ కృష్ణ.. ముగ్గురు ఆడపిల్లలు భువనేశ్వరి, పురాందేశ్వరి, ఉమామహేశ్వరి.. ఒక సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ చిన్న వయసులోనే అరుదైన వ్యాధితో మరణించారు. ఈయన మరణించినప్పుడు ఇరుగుపొరుగు షూటింగ్ లో ఉన్నారు అన్నగారు. అయినా ఆ షూటింగ్ ఆపేసి ఇంటికి చేరుకున్నారు. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా రోజులే పట్టిందట. ఇక ఇందులో మోహన్ కృష్ణ విషయానికి వస్తే ఈయన చిన్నతనం అంతా, నిమ్మకూరు, చెన్నైలో సాగింది.

Advertisement

పెళ్లయ్యే సమయానికి వీరంతా హైదరాబాదులో సెట్ అయిపోయారు. చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ఆయనకు నటనపై కాకుండా సినిమాటోగ్రఫీపై ఎక్కువ ఇష్టం పెంచుకున్నారు. ఇక చిన్నతనం నుంచి బాబాయ్ త్రివిక్రమ్ రావుతో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవాడు. డిగ్రీ చేస్తూనే ఫోటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నాడు. ముందుగా దానవీరశూరకర్ణ చిత్రానికి అసిస్టెంట్ కెమెరామెన్ గా కన్నప్ప వద్ద చేరారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై అనురాగ దేవత సినిమాకు సినిమా ఆటోగ్రాఫర్ గా పూర్తిస్థాయిలో సేవలందించారు. ఈయన 1980లో ప్రముఖ నిర్మాత యు. విశ్వేశ్వరరావు కూతురు శాంతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నందమూరి తారకరత్న, రూప సంతానం. రూప వివాహం 2014 ప్రముఖ వ్యాపారవేత్తతో జరిగింది. ఇక మోహనకృష్ణ తారకరత్నతో వి. సముద్ర దర్శకత్వంలో తెరకేక్కిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

also read:

Visitors Are Also Reading