సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులో కొద్దిమంది మాత్రమే సెటిల్ అవుతుంటారు. కొంత మంది ప్రాధాన్యత ఉన్న పాత్ర చిన్నదైనా సరే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఇక చాలా మంది అలా అవకాశాలు దక్కించుకొని కొన్నాళ్ల పాటు సినిమాల్లో నటించాక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక లేదా వారి వయస్సు సరిపోకనో సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. ఒక్కసారి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సక్సెస్ పుల్ గా ఎదిగి హీరో పాత్రలు తగ్గినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గకపోగా జీవితాంతం నటిస్తూనే ఉన్న నటీనటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇది కూడా చదవండి : జయప్రద మామ తెలుగు సినిమా లెజెండ్ అనే విషయం మీకు తెలుసా..?
చంద్రమోహన్ :
1966 రంగుల రాట్నం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటించాడు చంద్రమోహన్. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తరువాత హీరోగా మారాడు. ఎంతో మంది హీరోయిన్స్‌కి మొదటి హీరోగా నటించి రికార్డులు సృష్టించాడు. సినీ కెరీర్ ముగిసిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మళ్లీ తన జర్నీ ప్రారంభించి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. దాదాపు 60 ఏళ్లకు పైగా నిరంతరాయంగా నటించిన నటుల్లో చంద్రమోహన్ ఒకరని చెప్పుకోవచ్చు.
రాజేంద్ర ప్రసాద్ :
Advertisement
1977లో స్నేహం అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రాజేంద్రప్రసాద్. మొదట కొద్ది రోజుల పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సపోర్టింగ్ స్టార్‌గా ఉన్నాడు. ఆ తరువాత పంతం మార్చుకొని కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ వంటి దర్శకులకు రాజేంద్రప్రసాద్‌లోని కామెడీ యాంగిల్‌ని బయటపెట్టే అవకాశం వచ్చి వీరి దర్శకత్వంలో చాలా సినిమాల్లో నటించాడు. 20 ఏళ్లకి పైగా హీరోగా నటించిన తరువాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని బీజీ చేసుకున్నాడు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం తండ్రిగా, మామగా ఇలా సపోర్టింగ్ పాత్రలో ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇది కూడా చదవండి : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి
బ్రహ్మాజీ :
1986లో మన్నెంలో మొనగాగు సినిమా ద్వారా సపోర్టింగ్ పాత్రలో కనిపించాడు బ్రహ్మాజీ. ఇక ఆ తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి ఆ తరువాత హీరోగా మారాడు. సింధూరం వంటి సినిమాలో తనలోని హీరోయిజాన్ని చూపించాడు. పంవత్సరానికి దాదాపు 15 సినిమాలకు పైగా నటిస్తుంటాడు బ్రహ్మాజీ. హీరోగా ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఆయన కెరీర్ మాత్రం బిజీగానే ఉంటుంది. ఇప్పటికీ పలు సహాయ పాత్రలో నటిస్తూ తన కెరీర్‌ని కొనసాగిస్తున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూనే ఒక్కరోజు కూడా ఖీళీగా ఉన్న సందర్భంగా లేదని బ్రహ్మాజీ చెప్పడం గమనార్హం.
ఇది కూడా చదవండి : జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..!