Home » వివాహానికి వధువు, వరుడు యొక్క వయసు ఎంత తేడా ఉండాలో తెలుసా..?

వివాహానికి వధువు, వరుడు యొక్క వయసు ఎంత తేడా ఉండాలో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక మరిచిపోలేని అద్భుత కార్యం. వివాహంపై యువతీ, యువకులు అనేక ఆలోచనలు పెట్టుకొని అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని కలలుకంటారు. వివాహానికి దుస్తులు ఈ విధంగా కొనుక్కోవాలి, బంగారం అలా వేసుకోవాలి అనుకుంటారు తప్ప, వివాహం అంటే ఏ వయసులో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది ఏ ఒక్కరూ ఆలోచించరు.. ముఖ్యంగా వివాహం చేసుకోవాలంటే వయస్సు ఎంత ఉండాలో మనము ఓసారి చూద్దాం..? కాని ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడితోనే బతుకుతున్నారు. ఆహార విషయంలో నియమ నిబంధనలు ఉండటం లేదు. చదువు, ఉద్యోగం ఒత్తిడి సంపాదన వీటి చుట్టూ తిరుగుతూ వివాహాన్ని పక్కన పెడుతున్నారు. 20 సంవత్సరాల క్రితం వివాహాలు అంటే ఆడ, మగ మధ్య 15 సంవత్సరాల గ్యాప్ వచ్చినా పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదు. కానీ దీని తర్వాత కాస్త లెక్కలు మారాయి.

Advertisement

అబ్బాయి వయసు 30 ఉంటే అమ్మాయి వయసు 23నుండి 24 మధ్యలో ఉండాలని భావిస్తున్నారు. అయితే సినిమాల్లో చూపించినట్టు అబ్బాయి, అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకే క్లాసు, ఒకే కాలేజ్, ఒకే ఏజ్ లో ఇద్దరికి ఒకే రకమయిన మెచ్యూరిటీ కూడా ఉంటుంది. వీళ్లు వివాహం చేసుకుంటారు. మరి వీరిద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ వస్తే ఏ విధంగా సర్దుబాటు అవుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే విషయానికి వస్తుంది. సాధారణంగా పెళ్ళి విషయంలో ఏజ్ గ్యాప్ ఎందుకు ఉండాలి అంటే మన వివాహ వ్యవస్థలో అబ్బాయి ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ఇచ్చే వ్యవస్థ లో ఉంటాడు. అంటే సంసారాన్ని ముందుకు తీసుకు పోయే విధంగా ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరు సమానమైన వయసులో ఉంటే ఇద్దరి మెచ్యూరిటీ ఒకే విధంగా ఉంటే ఫ్యూచర్ లో కలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే 25 ఏళ్ల వయసులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు.

Advertisement

వారికి ముప్పై దాటే వరకు పిల్లలు కాలేదు అనుకోండి. ఆ వయసులో 30 దాటిన అబ్బాయిలకు పిల్లలు కలిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ అమ్మాయి మాత్రం 30 ప్లస్ దాటితే సంతాన సమస్యలు ఎదురవుతాయి. అదే 32 ఏళ్ల అబ్బాయి 26 ఏళ్ల బాలికను చేసుకుంటే అమ్మాయికి 30 వచ్చే వరకు పిల్లలకోసం చూడవచ్చు. 30 వయసు దాటినా అబ్బాయిలకు ఏ సమస్య అయితే ఉండదు. అమ్మాయిలకు మాత్రం పీరియడ్స్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అబ్బాయి అమ్మాయి వయసు మధ్య తేడా అనేది పూర్వకాలం అందుకే పెట్టి ఉంటారు. కాబట్టి అమ్మాయి, అబ్బాయి మధ్య వయసు తేడా కనీసం ఏడు సంవత్సరాలు ఉన్నా కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు.

ALSO READ;

రాజశేఖర్ కూతురి కోసం సహాయం అడగటానికి చిరు ఇంటికి వెళితే ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ?

న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ జంట‌ హ‌నీమూన్ కోసం ఎక్క‌డికి వెళ్లారో తెలుసా..?

 

Visitors Are Also Reading