Home » విడాకుల తరువాత కూడా నాగ చైతన్య సామ్ కోసం అలాంటి పనులు చేస్తున్నాడా ? నిజంగా గ్రేట్

విడాకుల తరువాత కూడా నాగ చైతన్య సామ్ కోసం అలాంటి పనులు చేస్తున్నాడా ? నిజంగా గ్రేట్

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగచైతన్య గతేడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలంపాటు ప్రేమించుకున్న వీరిద్దరు ఐదేళ్ళ వైవాహిక జీవితానికి శుభం కార్డు వేస్తూ విడాకులను ప్రకటించారు. ఈ విషయం అటు సమంత అభిమానులను ఇటు నాగచైతన్య అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. సమంత నాగచైతన్య మళ్లీ ఒకటవ్వాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఇక అలా జరగదని ఇప్పటికే తేలిపోయింది.

Advertisement

సమంత నాగచైతన్య విడాకులకు ముందు చాలా సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన మనం, మజిలీ, ఏ మాయ చేసావే సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే వీటిలో మజిలీ సినిమాలో పెళ్లి తర్వాత కలిసి నటించారు. ఇప్పటికీ ఈ సినిమా చూసి అభిమానులు ఇంత చక్కటి జంట ఎందుకు విడిపోయిందా అని బాధపడుతుంటారు.

Advertisement

ఇక విడాకుల తర్వాత నాగచైతన్య సమంత వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో కూడా నటిస్తోంది. అదే విధంగా తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. మరోవైపు నాగచైతన్య కూడా రీసెంట్ గా అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

అయితే నాగచైతన్యకు ఈ వెబ్ సిరీస్ లో నటించడం ముందుగా ఇష్టం లేదట. అంతేకాకుండా హారర్, థ్రిల్లర్ సినిమాల‌లో నటించాలనే ఆలోచన నాగచైతన్యకు లేదట. కానీ సమంత పట్టుబట్టి నాగచైతన్యతో ఆ వెబ్ సిరీస్ చేయాలని కోరింద‌ట‌. అలా స‌మంత కోరిక‌తోనే చైతూ ఈ వెబ్ సిరీస్ కు ఒప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం సమంత లేకపోయినా ఆమెకు న‌చ్చిన‌ పనులనే చైతూ చేస్తున్నాడంటే నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading