టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు ఎన్టీఆర్. ఆస్తుల విలువ గత కొద్ది సంవత్సరాల కాలంలో భారీగానే పెరిగింది. సినిమాల ద్వారా సంపాదించినటువంటి డబ్బును చాలా తెలివిగా ఎన్టీఆర్ ఇన్వెస్ట్ చేశారని సమాచారం. భూములపై తారక్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టారని.. ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Sr. ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు అవమానాలు తట్టుకొని స్టార్లుగా ఎదిగిన హీరోలు..?
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ దాదాపు రూ.440 కోట్లు అని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క సినిమాకి ఎన్టీఆర్ రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. సినిమాలు చేయకపోయినప్పటికీ ఎన్టీఆర్ నెలు రూ.3కోట్ల వరకు ఆదాయం ఉంటుందని.. ఇక సినిమాలు చేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతుండగా.. ఎన్టీఆర్ వద్ద ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమాలు విదేశీ భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశముంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే.
Advertisement
Also Read : పెళ్లిచూపుల్లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ అడిగిన 2 ప్రశ్నలు.. యంగ్ టైగర్ మామూలోడు కాదుగా..?
ఎన్టీఆర్ నుంచి వచ్చే ప్రతీ ప్రాజెక్ట్ మరింత స్పెషల్ గా ఉండేవిధంగా ప్లాన్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా.. ఇతర హీరోలతో సైతం ఈ స్టార్ హీరో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్ ప్రాజెక్ట్ ల కోసం క్రేజ్ ఉన్న టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డు వరిస్తే మరింత ఉత్సాహంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ తరువాత ప్రాజెక్టుల కోసం పని చేసే అవకాశముంది. ప్రస్తుతం కొరటాలతో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తి కాగానే.. కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ నటించే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి మరి.