సాధారణంగా కొన్నిసార్లు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి. యాదృచ్ఛికంగా జరిగిన లేదా కావాలని జరిగిన అయినా సరే అవి చరిత్రలో నిలిచిపోతుంటాయి. అలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయి. తెలుగులో ముఖ్యంగా గుమ్మడి, ఎస్వీ రంగారావు లాంటి పెద్ద తరహా పాత్రలకు పేరెన్నికగల నటుల పేర్లు చెప్పమంటే ఆ తరువాత కాలంలో మరో ముగ్గురు నటుల పేర్లు ప్రముఖంగా చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒకరు కైకాల సత్యనారాయణ, మరొకరు తిలకన్, బాలీవుడ్ నటుడు ప్రాణ్. ఈ ముగ్గురు నటులు కూడా తమ కెరీర్‌లో పెద్ద తరహా పాత్రలు చాలా పోషించారు.
Advertisement
Advertisement
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ముగ్గురు ఒకే తరహా నటులు ఒకే పాత్రను వారి వారి భాషల్లో ఒకరు చేసింది మరొకరు చేశారు. ఇది వార్తవంగా యాదృచ్చికమనే చెప్పాలి. కైకాల సత్యనారాయన తన సొంత ప్రొడక్షన్ కంపెనీ ద్వారా చిరంజీవి హీరోగా ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరు కొదమసింహం. ఈ చిత్రంలో నటుడు ప్రాణ్, కైకాల సత్యనారాయణ కలిసి నటించారు. ప్రాణ్ ఇందులో విలన్‌గా నటించగా.. సత్యనారాయణ చిరంజీవికి తండ్రి పాత్రలో నటించడం విశేషం. తిలకన్, సత్యనారాయణ కలిసి నటించారు వీరిద్దరూ కలిసి నటించిన సినిమా సమరసింహారెడ్డి. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్ర తిలకన్ చేస్తే.. ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కైకాల సత్యనారయణ నటించారు.
ఇలా ఒకరి పాత్రను ఆ తరువాత కాలంలో మరొకరు పోషించడం నిజంగా యాదృచ్ఛికమనే చెప్పాలి. ఈ ముగ్గురు నటుల్లో ప్రాణ్ వయసులో కాస్త పెద్దవాడు. 1920లో పుట్టి బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోనూ కొన్ని సినిమాల్లో నటించాడు. 1935 జులైలో సత్యానారయణ, తిలకన్ కొద్ది రోజుల తేడాతో ఒకేసారి జన్మించారు. తిలకం మలయాళ ఇండస్ట్రీలో యాభై ఏళ్లకు పైగా విలన్ తో ఆకట్టుకోగా తెలుగులో కైకాల సత్యనారాయణ కొన్ని వందలాది సినిమాల్లో నటించాడు.
ఇది కూడా చదవండి : సమంతతో నా ప్రయాణం ముగిసింది..!