Telugu News » సమంతతో నా ప్రయాణం ముగిసింది..!

సమంతతో నా ప్రయాణం ముగిసింది..!

by Azhar
Ad

సమంతకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు అనేది ఉన్న విషయం తెలిసిందే. అయితే మొదట టాలీవుడ్ లో హీరోయిన్ గా అంచెలంచెలుగా ఎదిగిన సమంతకు ఆ ప్రయాణంలో చాలా మంది సహాయం చేసారు. అందులో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి కూడా ఉంది. అయితే సమంత మొదటి సినిమా ఏం మాయ చేసావే సినిమాలో చిన్మయి తనకు డబ్బింగ్ చెప్పింది. అలా వీరి ప్రయాణం అనేది మొదలయ్యింది.

Advertisement

ఇక సమంత నటించిన ఎక్కువ సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉండేది. ఆ క్రమంలోనే వీరి మధ్య స్నేహం అనేది కూడా బాగా పెరిగింది. అందుకే ఇద్దరు ఒక్కరికి ఒకరు బాగా సపోర్ట్ అనేది ఇచ్చుకునేవారు. మీటు సమయంలో చిన్మయికి సమంత.. విడాకుల సమయంలో సమంతకు చిన్మయి సపోర్ట్ చేసుకున్నారు. కానీ తాజాగా సమంతతో నా ప్రయాణం ముగిసింది అంటూ చిన్మయి కామెంట్స్ చేయడం అనేది వైరల్ గా మారింది.

Advertisement

అయితే చిన్మయి ఇచ్చినా ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు మీరు సమంతకు డబ్బింగ్ చెప్పడం లేదు ఎందుకు అని ప్రశ్నించగా.. ఇప్పుడు సమంతకు నా అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఆమెతో నా ప్రయాణం అనేది ముగిసింది. కానీ మా స్నేహం అలానే ఉంది. ఇక ఈ మధ్యే ఇద్దరు కలిసి కపించకపోవడంపై స్పందిస్తూ… మేము ఇప్పుడు కూడా ఎప్పుడైనా కలవాలి అనుకుంటే.. బయట లేకుండా నేరుగా ఇంట్లోనే కలుస్తాం.. ఎంజాయ్ చేస్తాం అని చిన్మయి పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ నోరు మూయించిన ఇర్పాన్ పఠాన్..!

బాబర్ ఇక కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి..!

Visitors Are Also Reading