Home » కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి ఖాకి దుస్తుల కథ గురించి మీకు తెలుసా..?

కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి ఖాకి దుస్తుల కథ గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. దర్శకుడు కోడి రామకృష్ణ తలకు క్లాత్ కట్టుకుంటాడు.. రాఘవేంద్రరావు దాదాపు గడ్డంతోనే కనిపిస్తుంటాడు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా సినిమా షూటింగ్ జరిగినన్ని గురువు రాఘవేంద్రరావునే అనుసరిస్తుంటాడు. ఇక దర్శకుడు కె.విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలుత సౌండ్ రికార్డు అసిస్టెంట్ గా తన కెరీర్ ని ప్రారంభించారు. ఇక ఆ తరువాత క్రమక్రమంగా దర్శకుడిగా మారారు. తనకు తెలియకుండానే తనలో గర్వం వచ్చేస్తే ఎలా అని కళాతపస్వి ఆలోచించారు. 

Advertisement

సినిమా రంగానికి కెప్టెన్ దర్శకుడు. అలాంటి దర్శకుడు ఓ స్టైల్ గా ఉంటూ.. హంగామా చేయడం కె.విశ్వనాథ్ కి అస్సలు నచ్చలేదట. ఒకవేళ అలా ప్రవర్తిస్తే.. కాళ్లు నెత్తికెక్కాయని అందరూ భావిస్తారని ఆలోచించారు. సాధారణంగా సెట్స్ లో పని చేసే లైటర్ బాయ్స్, పేయింటర్స్ ఖాకీ రంగు దుస్తులనే వేసుకుంటారు.వారు ఖాకీ షర్ట్ తో పాటు నిక్కర్ వేసుకుంటే.. దర్శకుడు కె.విశ్వనాథ్ మాత్రం ఖాకీ షర్ట్, ప్యాంట్ ధరించేవారు. ఈ విషయాన్ని స్వయంగా కె.విశ్వనాథ్ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఇది విన్నవారు వాస్తవంగా ఆశ్చర్యపోయారు. విశ్వనాథ్ ఇలా కూడా ఆలోచిస్తారా అని అనుకునేవారట. ముఖ్యంగా మనం చేసే పని పట్ల నిబద్ధత ఉండాలే తప్ప కళ్లు నెత్తికెక్కకూడదనే ఆలోచన చాలా మందికి ఆదర్శమనే చెప్పాలి. 

Advertisement

Also Read :   వెలుతురును మనమే వెతుక్కోవాలి…సమంత ఎమోషనల్ పోస్ట్…!

Manam News

దర్శకుడిని అయిపోగానే తెల్ల ప్యాంట్, తెల్లచొక్క, తెల్ల బూట్లూ, మెడలో గొలుసులు వేసుకొని హడావుడి చేయడం నాకిష్టం లేదని.. తాను అందరి మాదిరిగానే మామూలు మనిషిలాగానే ఉండాలనుకున్నా. నిజాయితీగా చేసిన ప్రయత్నం ఇదని చెప్పారు. నాసెట్ లో పని చేసే పేయింటర్స్, లైట్ బాయ్స్ హెల్పర్స్ అందరికీ ఖాకీ దుస్తులే. కాకపోతే వాళ్లకు నిక్కరు, నాకు ప్యాంట్ తేడా అని చెప్పారు. మీరు ఖాకీ డ్రెస్ వేసుకోవడం ఏమిటండీ ఆర్ట్ డైరెక్టర్ తెగ గొడవపడేవాడని.. మొదటి సినిమా సరిగ్గా ఆడకపోతే వెంటనే ట్యాక్సీ డ్రైవర్ గా మారిపోతాను అని చెప్పుకొచ్చారు. అప్పుడు కుట్టించుకోవడానికి వీలుంటుందో లేదో ఓ జత సిద్ధంగా ఉన్నట్టుంటుందని చెప్పుకొచ్చాడు విశ్వనాథ్. అలాంటి దిగ్గజ దర్శకుడు మరణించాడని తెలుసుకొని తెలుగు చిత్ర పరిశ్రమ ఫిబ్రవరి 03, 2023న బంద్ చేసింది. ముఖ్యంగా శంకరాభరణం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, సాగరసంగమం, స్వయంకృషి వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 02న మరణించిన విషయం తెలిసిందే.   

Also Read :  గుర్తు పట్టలేనంతగా మారిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్…! ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading