Home » వెలుతురును మనమే వెతుక్కోవాలి…సమంత ఎమోషనల్ పోస్ట్…!

వెలుతురును మనమే వెతుక్కోవాలి…సమంత ఎమోషనల్ పోస్ట్…!

by AJAY
Ad

కొన్నేళ్లుగా సమంత స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగు వెలుగుతోంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అలాంటి సమంత లైఫ్ లోకి అనుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చాయి. గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అక్కినేని నాగచైతన్య తో విడాకులు అయ్యాయి. ఆ బాధ నుండి బయట పడకముందే సమంత జీవితంలో మరో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ వ్యాయామం చేసే సమంత అనారోగ్యం బారిన పడింది. యశోద సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం తో ఆస్పత్రిలో చేరగా సమంత కు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్టు డాక్టర్ లు నిర్దారించారు. ఆ తరవాత సమంత చాలా కాలం పాటు సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది.

Advertisement

కాగా ప్రస్తుతం సమంత ఆరోగ్యం కుదుట పడింది. దాంతో మళ్ళీ మేకప్ వేసుకుని షూటింగ్ లో పాల్గొనటానికి రెడీ అయ్యింది. సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డికే దర్శకత్వం లో వస్తున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ షూటింగ్ కోసం సమంత సెట్ లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో నే సమంత షూటింగ్ కు వెళుతూ సూర్యుడి వెలుతురుకి సెల్ఫీ దిగింది….అంతే కాకుండా ఆ ఫోటోను షేర్ చేసి ఆ ఫోటోకు వెలుతురును మనమే వెత్తుక్కోవాలి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Also read : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్…! ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading